- మోహన్‌బాబు
‘‘ఏ చిత్రానికైనా దర్శకుడే కెప్టెన్. దశరథ్ నిగర్వి. మా సంస్థలో మనోజ్‌తో ‘శ్రీ’ చిత్రం చేశాడు. ఇన్ని రోజులుగా మనోజ్‌ను నేను ఎలాంటి పాత్రలో చూడాలనుకున్నానో ఈ చిత్రంలో సరిగ్గాఅలాంటి పాత్రలో కనిపించనున్నాడు’’ అని మంచు మోహన్‌బాబు అన్నారు. మంచు మనోజ్, రెజీనా జంటగా బేబీ త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రై.లి. పతాకంపై దశరథ్ దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన చిత్రం ‘శౌర్య’. వేదా కె. స్వరపరచిన ఈ చిత్రం పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. మోహన్‌బాబు బిగ్ సీడీ, దర్శకుడు బి.గోపాల్ పాటల సీడీ ఆవిష్కరించారు. ‘‘దశరథ్ సాఫ్ట్ డెరైక్టర్. తన తమ్ముడు వేదాను సంగీత దర్శకునిగా పరిచయం చేస్తున్నాడు.
ఈ చిత్రం మనోజ్ కెరీర్‌లో బెస్ట్‌గా నిలిచిపోతుంది’’ అని దర్శకుడు శ్రీవాస్ తెలిపారు. దశరథ్ మాట్లాడుతూ -‘‘ఇదొక లవ్‌స్టోరీ కమ్ థ్రిల్లర్. రెగ్యులర్ ప్రేమకథలకు భిన్నంగా ఉండే ప్రేమ కథా చిత్రం. నిర్మాత శివకుమార్‌గారు ఈ చిత్రంతో నాకు మంచి మిత్రుడయ్యారు. మనోజ్ లేకుంటే ఈ చిత్రం ఇంత బాగా వచ్చుండేది కాదు. రెజీనా చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్’’ అని చెప్పారు. ఈ వేడుకలో శ్రీమతి మంచు నిర్మల, ఎమ్మెల్యే ‘రసమయి’ బాలకిషన్, బ్రహ్మానందం, దర్శకులు ఎన్.శంకర్, చంద్ర మహేష్, నిర్మాతలు శైలేంద్రబాబు, బెక్కెం వేణుగోపాల్, సంగీత దర్శకుడు ఆర్‌పి పట్నాయక్, గొట్టిముక్కల పద్మారావు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment