గత ఏడాది ఆగస్టు నుంచి స్టాక్ మార్కెట్ తీవ్ర ఆటుపోట్లకు లోనవుతోంది. దీంతో నెల నెలా క్రమానుగత పెట్టుబడి (సిప్) పద్ధతిలో మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో మదుపు చేసే ఇన్వెస్టర్లూ నష్టాల పాలయ్యారు. ఇండెక్స్‌లు ఇప్పటికే 30 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. మరి ఈ పరిస్థితుల్లో సిప్ పద్ధతిలో మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లలో మదుపు చేసే మదుపరులు పెట్టుబడులు కొనసాగించాలా? వద్దా? అనే విషయాలు చూద్దాం..
మార్కెట్ల పతనం ఎంత వరకు?
నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఉరకలేసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇపుడు నేలచూపులు చూస్తున్నా యి. నిఫ్టీ ఇప్పటికే 7000 పాయింట్లు, సెన్సెక్స్ 23000 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఇండెక్స్‌లు ఇంకా ఎంత నష్టపోయే అవకాశం ఉందని ప్రశ్నిస్తే ఎవరి దగ్గరా సరైన సమాధానం లేదు. ఒకవేళ సమాధానం చెప్పినా ఉజ్జాయింపుగా ఊహాజనిత సమాధానాలే వస్తాయి. కాబట్టి ఇండెక్స్‌లు మరింత భారీగా పతనం అవుతాయని ఆశిస్తూ వేచి చూడడం ఏ మాత్రం మంచిది కాదు.
పెట్టుబడులు ఆపడం మంచిదేనా?
ఇండెక్స్‌ల పతనంతో సిప్ (సిస్టమాటిక్ ఇన్వె్‌స్టమెంట్ ప్లాన్స్) ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువా పడిపోతోంది. దీంతో సిప్ పెట్టుబడులు కొనసాగించాలా?వద్దా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిపుణులు మాత్రం పెట్టుబడులు కొనసాగించడమే మేలంటున్నారు. ఇండెక్స్‌లు ఎంత పడితే అంత ఎక్కువగా సిప్ మదుపరులకు మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు లభించడమే ఇందుకు కారణం. మార్కెట్‌లో బుల్ రన్ ప్రారంభమైతే అపుడు ఈ యూనిట్ల ఎన్‌ఎవీలూ (నెట్ అసెట్ వాల్యూ) అదే స్థాయిలో పెరుగుతాయనే విషయం మరువకూడదు. ఈ విషయం మర్చిపోయిన ఇండెక్స్‌లు ఇంకా పడి, అదే పెట్టుబడికి మరిన్ని యూనిట్లు లభిస్తాయని వేచి చూడడం ఏ మాత్రం తెలివైన పని కాదు. ఒకవేళ ఇండెక్స్‌లు పైకి దూసుకుపోతే, అపుడు మన సిప్ పెట్టుబడులకు లభించే యూనిట్ల సంఖ్యా తగ్గిపోతుంది. ఇండెక్స్‌లు ఇంకా పడతాయనే వ్యూహం ట్రేడర్లకు కొంత వరకు పనికొస్తుంది తప్ప, సిప్ ఇన్వెస్టర్లకు పనికి రాదు.
ఆర్థిక వ్యవస్థపై దృష్టి..
చాలా మంది ఫైనాన్షియల్ ప్లానర్లు తమ ఖాతాదారులకు సిప్‌నే రికమండ్ చేస్తుంటారు. దీర్ఘకాలంలో మార్కెట్లు లాభాలు పంచుతాయనే నమ్మకంతోనే వారిలా రికమండ్ చేస్తుంటారు. దీర్ఘకాలంలో భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత బాగుంటుందనుకుంటే, భారత స్టాక్ మార్కెట్ బాగానే ఉంటుంది. స్టాక్ మార్కెట్ బాగుంటే సిప్ పద్ధతిలో మ్యూచువల్ ఫండ్ సంస్థల యూనిట్లలో పెట్టుబడి పెట్టే పెట్టుబడులూ దీర్ఘకాలిక లాభాలు అందిస్తాయని ఆశించాలి. కొన్ని ఇబ్బందులున్నా మిగతా దేశాలతో పోలిస్తే మన ఆర్థిక వ్యవస్థ బాగానే ఉంది. ఇప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ ఏటా ఏడు శాతానికిపైగా వృద్ధి రేటు సాధిస్తోంది. ఈ విషయం దృష్టిలో ఉంచుకున్నా సిప్ పద్ధతిలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు కొనసాగించవచ్చు.
తక్కువ స్థాయిలో కొనడమే మేలు..
సిప్ పెట్టుబడులకు సగటు ధరే ఆధారం. ఇండెక్స్‌లు అధిక స్థాయిలో ఉన్నపుడు సిప్ ద్వారా మనం పెట్టే పెట్టుబడులకు తక్కువ యూనిట్లు వస్తాయి. అదే ఇండెక్స్‌లు తక్కువ స్థాయిలో ఉంటే ఎక్కువ యూనిట్లు లభిస్తాయి. దీంతో యూనిట్ల కొనుగోలు ధరను యావరేజ్ చేసుకోవచ్చు. మార్కెట్ ఎపుడు కనిష్ఠ స్థాయికి పడిపోతుందనే విషయం తెలుసుకోలేక పోవడమే ఇక్కడ పెద్ద సమస్య. ఇండెక్స్‌లు పడిపోతున్నా దీర్ఘకాలంలో మార్కెట్‌కు ఢోకా ఉండదనుకుంటే సిప్ ద్వారా ఎక్కువ యూనిట్లు సొంతం చేసుకోవడమే మంచిది. మార్కెట్ కోలుకున్నపుడు ఈ పెట్టుబడులు మంచి లాభాలు ఇస్తాయి.
పై విషయాలు గుర్తుంచుకుంటే బేర్ మార్కెట్లోనూ సిప్ పెట్టుబడులతో మంచి లాభాలు పొందవచ్చు. కాకపోతే కాస్తంత ఓపిక, ధైర్యం ఉండాలి. సిప్ పెట్టుబడులు దీర్ఘకాలిక లాభాల కోసం పెట్టే పెట్టుబడి అని గుర్తించడం అన్నిటికంటే ముఖ్యం.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Post a Comment