ముంబై: జికా... ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వైరస్ ఇది. చిత్రంగా టాటా మోటార్స్ కంపెనీ త్వరలోనే తేనున్న హ్యాచ్‌బాక్ పేరు కూడా ఇదే. అయితే జికా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో జిప్పీ కార్ నుంచి తీసుకున్న జికా పేరును మార్చాలని టాటా మోటార్స్ యోచిస్తోంది. వివిధ దేశాల్లో జికా వైరస్ ప్రబలి ప్రజలను బెంబేలెత్తిస్తున్నందున సామాజిక బాధ్యత గల కంపెనీగా ఈ హ్యాచ్‌బాక్ జికాను రీ బ్రాండ్ చేయాలనుకుంటున్నామని టాటా మోటార్స్ వెల్లడించింది.
గ్రేటర్ నోయిడాలో నేటి నుంచి ప్రారంభమయ్యే ఆటో ఎక్స్‌పోలో ఈ కారును టాటా మోటార్స్ డిస్‌ప్లే చేయనున్నది. ఈ ఎక్స్‌పోలో జికా పేరుతోనే ఈ కారును డిస్‌ప్లే చేస్తామని, కొత్త పేరును కొన్ని వారాల్లో ప్రకటిస్తామని కంపెనీ పేర్కొంది. యువ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని టాటా మోటార్స్ అందిస్తున్న ఈ కారు పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈ కారు ధర రూ.5-6 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
Post a Comment