-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

February 08, 2016

వాలెంటెయిన్స్ డే కోసం లోన్ కావాలట...?


గాంధీనగర్: ఇప్పటి వరకు ఏదైన ఒక సమస్య నుంచి బయటపడేందుకో, పెట్టుబడి పెట్టేందుకో, చదువుకునేందుకో, ఓ ఇంటిని నిర్మించుకునేందుకో, లేదా ఓ ఇంటివాడిగా మారేందుకో బ్యాంకులను ఆశ్రయించి రుణాలు తీసుకోవడం తెలిసిందే. అయితే, ప్రేమికుల రోజు జరుపుకునేందుకు కూడా రుణం కావాలని దరఖాస్తు చేసుకుంటే.. గుజరాత్‌లో ఇలాగే జరిగింది. అది కూడా బ్యాంకు ఉద్యోగే ఈ దరఖాస్తు చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్ కు చెందిన ఎస్ బీఐ బ్రాంచ్ లో దిగ్విజయ్ సింగ్ (25) అనే వ్యక్తి ప్రొబేషనరీ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. త్వరలోనే ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు జరగనుంది.

ఈ నేపథ్యంలో తనకు ప్రేమికుల రోజు జరుపుకునేందుకు రూ.42,970 అడ్వాన్స్ గా ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఈ దరఖాస్తును పరిశీలించిన బ్యాంకు మేనేజర్ దానిని తిరస్కరించారు. ప్రేమికుల రోజును పండుగగా గుర్తించి లోన్ ఇవ్వడం సాధ్యం కాదని ఆ ఉద్యోగికి స్పష్టం చేశారు. ఈ విషయంపై దరఖాస్తు చేసుకున్న దిగ్విజయ్ మాట్లాడుతూ తానేం పబ్లిసిటీ కోసం ఈ దరఖాస్తు చేసుకోలేదని, దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని చెప్పారు. గతంలో వసంతపంచమి పండుగకు ఆయన లోన్ దరఖాస్తు చేసుకుంటే బ్యాంకు మంజూరు చేసింది. 

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu