తిరువొత్తియూరు:
సినిమాల మీద కోరికతో కుటుంబాన్ని వదులుకుని వచ్చి హత్య కు గురైన సహాయ నటి శశిరేఖ హత్య కేసులో మిస్టరీ వీడింది. పోలీసుల విచారణలో భర్త రమేష్ శంకర్, ప్రేయసి లక్కియ కలిసి శశిరేఖను హత్య చేసినట్టు అంగీకరించాడు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో హత్యకు గురైన నెలరోజుల తర్వాత కోలపాకం కెనాల్ లో నటి శశిరేఖ తల భాగాన్ని వెలికితీశారు.
హత్యకు గురైన మరుసటి రోజే శశిరేఖ మొండెం చెత్త కుండీలో లభ్యమైన విషయం తెలిసిందే. శశిరేఖ, రమేష్ లు పోరూర్ సమీపంలోని మదనపురంలో నివాసం ఉన్నారని వీరితోపాటూ మరోయువతి లక్కియ కూడా ఉన్నట్టు తెలిసింది. పోలీసుల విచారణలో రమేష్ శశిరేఖను హత్యచేసినట్టు నిర్ధారణ కావడంతో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సెల్ ఫోన్ ఆధారంగా షోళింగనల్లూరులోని ఓ అపార్టుమెంటులో వుంటున్న రమేష్ శంకర్, అతని ప్రియురాలు లక్కియను అరెస్టు చేశారు. చెల్లెలు అని పరిచయం చేసిన లక్కియ రమేష్ శంకర్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలియడంతో శశిరేఖ భర్తను మందలించింది. దీంతో ఆగ్రహం చెందిన రమేష్ శంకర్, లక్కియ కలిసి శశిరేఖను హత్య చేసి పారిపోయినట్టు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.
Post a Comment