- టీమిండియాకు చావోరేవో
- నేడు శ్రీలంకతో రెండో టీ-20
- ఓడితే సిరీస్, నెంబర్ వన్ గల్లంతు
- ఒత్తిడిలో ధోనీసేన
రాంచీ: కుర్రాళ్లతో నిండిన శ్రీలంక చేతిలో తొలి మ్యాచ్ పరాభవంతో కంగుతిన్న టీమిండియా ఇప్పుడు మరో కఠిన సవాల్‌కు సిద్ధమైంది. సిరీ్‌సతో పాటు నెంబర్‌వన్ ర్యాంక్ ఆశలు నిలుపుకోవాలంటే రెండో మ్యాచలో కచ్చితంగా నెగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ధోనీ స్వస్థలం రాంచీలోని జేఎ్‌ససీఏ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగే రెండో టీ-20లో భారత అమీతుమీ తేల్చుకోనుంది. మొదటి మ్యాచలో ఓటమికి పుణె పిచ ప్రధాన కారణమన్న కెప్టెన మహీ.. పక్కా ఉపఖండ వికెట్‌పై సొంత అభిమానుల మధ్య కీలక సవాల్‌ను స్వీకరించనున్నాడు. గత మ్యాచ్‌లో లోపాలను వెంటనే సరిదిద్దుకొని లంకను దెబ్బకు దెబ్బ తీయాలని కోరుకుంటున్నాడు. మరోవైపు ఊహించని విజయంతో వచ్చిన జోష్‌లో ఉన్న లంక మరోమారు ఆతిథ్య జట్టును దెబ్బకొట్టి సిరీ్‌సను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. సిరీస్ నెగ్గితే లంక నెంబర్ వన్ ర్యాంకుకు ఎగబాకనుండగా, భారత ఏడో స్థానానికి పడిపోనుంది. వాస్తవానికి తొలి మ్యాచ్‌లో నెగ్గిన శ్రీలంక ఇప్పటికే అనధికారికంగా నెంబర్ వన్‌కు చేరుకుంది. ఇక సిరీ్‌సకు, ర్యాంక్‌కు కీలకమైన ఈ పోరు రాంచీలో జరుగుతున్న మొదటి టీ-20 కావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఇక్కడ ఆడిన మూడు వన్డేల్లో భారత రెండింట్లో నెగ్గింది. ఆసే్ట్రలియాతో మ్యాచలో ఫలితం తేలలేదు. కాగా ఈ మ్యాచ్‌లోనూ అవుట్ ఫీల్డ్‌లో ఫీల్డర్లు ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తోంది. మైదానం సిద్ధం చేసేందుకు తమకు చాలా తక్కువ సమయం ఇచ్చారని జీఎ్‌ససీఏ సిబ్బంది చెబుతున్నారు.
మిడిల్ రాణించాలి:గత మ్యాచ్‌లో భారత జట్టులో అనేక లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. ఆసే్ట్రలియాతో పొట్టి ఫార్మాట్‌లో మూడు మ్యాచల్లో భారత మిడిల్, లోయర్ ఆర్డర్‌కు బ్యాటింగ్ చేసే అవకాశాలు రాలేదు. కానీ, పుణెలో అందరూ బ్యాటింగ్ చేసినా ఫలితం మాత్రం వేరేలా వచ్చింది. పరిస్థితులను అర్థం చేసుకోలేకపోయిన ఆటగాళ్లు సీమింగ్ ట్రాక్‌పై పేలవ షాట్లు ఆడి వికెట్లు పారేసుకున్నారు. అశ్విన ఒక్కడే కాస్త ఓపిక వహించడంతో స్కోరుబోర్డుపై ఆ మాత్రం పరుగులైనా చేరాయి. టాపార్డర్ విఫలమైనప్పుడు మిడిల్, లోయర్ ఆర్డర్ బాధ్యత తీసుకోవాల్సిఉంది. త్వరలో ఆసియాకప్, టీ-20 వరల్డ్‌క్‌పలో ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్న నేపథ్యంలో స్వదేశంలో అయినా, బయట అయినా బ్యాట్స్‌మెన పరిస్థితులకు తగ్గట్టు ఆడాలని కెప్టెన ధోనీ కోరుకుంటున్నాడు. ఇక ఫీల్డింగ్ తప్పిదాలు కూడా భారత కొంపముంచాయి. రహానె మంచి క్యాచ్‌ను వదిలేయగా, ఒకటి రెండు రనౌట్ చాన్స్‌లను భారత సద్వినియోగం చేసుకోలేకపోయింది.
మహిమ చూపాలి: అన్నింటి కంటే ముఖ్యంగా తన ఫామ్‌పై ధోనీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతిష్టాత్మక వరల్డ్‌క్‌పనకు ముందు తనలోని నిఖార్సైన ఫినిషర్‌ను బయటకు తీయాల్సి ఉంటుంది. అత్యుత్తమ ఫినిషర్లలో ఒకడిగా గుర్తింపుపొందిన మహీ ఖ్యాతి ఇటీవలి కాలంలో వరుస వైఫల్యాల కారణంగా మసకబారుతోంది. తన ఫామ్, కెప్టెన్సీపై వస్తున్న ప్రశ్నలకు జవాబివ్వాలంటే సొంతగడ్డపై అదీ, బ్యాటింగ్ ట్రాక్‌పై అతను విజృంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ మ్యాచలో తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండే అవకాశం కనిపించడం లేదు. లెఫ్టార్మ్ స్పిన్నర్ పవన్ నేగికి అరంగేట్రం చాన్స్ ఇవ్వాలనుకుంటే మాత్రం గత మ్యాచ్‌లో నిరాశపరిచిన హార్దిక్ పాండ్యాను పక్కనబెట్టే సూచనలున్నాయి. పేసర్లు ఆశీష్ నెహ్రా, బుమ్రాకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని ధోనీ భావిస్తున్నాడు. దీంతో భువనేశ్వర్‌కు చాన్స రాకపోవచ్చు. అశ్విన బాగా రాణిస్తున్నందున హర్భజన బెంచకే పరిమితం కావొచ్చు.
ఉత్సాహంలో లంక: మరోవైపు చాలా మంది కొత్త ఆటగాళ్లతో బరిలోకి దిగిన శ్రీలంకలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తమపై అంచనాలే లేకపోవడంతో ఈ సిరీ్‌సలో ఓడినా వారిపై పెద్దగా ప్రభావం ఉండబోదు. దీంతో వాళ్లు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది. అయితే మంచి ఫామ్‌లో ఉన్న భారత బ్యాట్స్‌మెనను పుణె పిచపై తీవ్రంగా ఇబ్బంది పెట్టిన లంక.. రాంచీ బ్యాటింగ్ ట్రాక్‌పై ఏ మేరకు అడ్డుకుంటుందో చూడాలి. పచ్చికపై అదరగొట్టిన లంక పేస్ త్రయం కాసున రజిత, దష్మంత చమీర, దసున షనక ఈ మ్యాచలో సవాల్ ఎదుర్కోనున్నారు. గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన స్టార్ బ్యాట్స్‌మన్ తిలకరత్నె దిల్షాన్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు. అతను తుదిజట్టులో ఉంటే లంక బ్యాటింగ్ విభాగం మరింత బలోపేతం అవుతుంది.
పిచ్/వాతావరణం జేఎస్ సీఏ స్టేడియం పిచ్ పక్కా బ్యాటింగ్ ట్రాక్. అయితే తేమ కారణంగా తొలి రెండు మూడు ఓవర్లలో బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇక శుక్రవారం వాతావరణం పొడిగా ఉండనుంది. మ్యాచ సమయంలో కొంతసేపు ఆకాశం మేఘావృతం అయి ఉండవచ్చు. కానీ, వర్ష సూచనలు లేవు.
జట్లు (అంచనా)భారత్: ధవన్, రోహిత్, రహానె, రైనా, యువరాజ్, ధోనీ (కెప్టెన్/కీపర్), జడేజా, హార్దిక్ పాండ్యా/పవన్ నేగి, అశ్విన్, జస్‌ప్రీత బుమ్రా, ఆశీష్ నెహ్రా.
శ్రీలంక: దిల్షాన్/నిరోషన డిక్‌వెలా, దనుష్క గుణతిలక, దినేశ చాందిమల్ (కెప్టెన/కీపర్), కపుగెదెర, దసున షనక, మిలింద సిరివర్దన, తిసారా పెరీర, సీకుగె ప్రసన్న, సచిత్ర సేననాయకె, దుష్మంత చమీర, కాసున రజిత.
సన్నాహకం కొనసాగిస్తాం
గత మ్యాచ్‌లో ఓటమితో మేం డీలా పడిపోలేదు. ప్రపంచకప్ జట్టు లో సభ్యులకు ఎ క్కువ అవకాశా లు ఇవ్వాలని భావిస్తున్నాం. మె గా టోర్నీ నాటికి పటిష్ట జట్టును తయారు చేయాలన్న సన్నాహకాలను కొనసాగిస్తాం. అయితే పిచ్ పరిస్థితులు, సిరీస్ ఫలితాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటాం. తొలి టీ-20 ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి లేదు. ఆ పిచ్‌పై మేం 140 పరుగులు చేస్తే మంచి స్థితిలో ఉండేవాళ్లం. గత మ్యాచ్‌లో పిచ్ అనూహ్యంగా స్పందించింది. మేం, జాగ్రత్తపడాల్సింది. When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Post a Comment