హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల హడావుడి నుంచి ఇప్పుడిప్పుడే సేదతీరునున్న హైదరాబాద్ లో సోమవారం సాయంత్రం హఠాత్తుగా కాల్పులు చోటుచేసుకున్నాయి. నగరం నడిబొడ్డులోగల హిమాయత్ నగర్ ఆరో నంబర్ వీధిలో ఇద్దరు డాక్టర్లు ఒకరినొకరు తుపాకులతో కాల్చుకున్నారు. బుల్లెట్ శబ్ధాలకు స్థానికులు అటు ఇటు పరుగులు తీశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించేపనిలో ఉన్నారు.
ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం సదరు డాక్టర్లిద్దరూ, మరో డాక్టరూ మాదాపూర్ లోని గ్లోరియల్ హాస్పిటల్ డైరెక్టర్ల సమావేశంలో గొడవ పడ్డారు. సమావేశం ముగిసిన తర్వాత హిమాయత్ నగర్ లో ఒకరిపై ఒకరు కాల్పులకు పాల్పడ్డారు. గాయపడ్డ ఇద్దరినీ స్థానికులు హైదర్ గూడాలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆ ఇద్దరి పేర్లు, మాదాపూర్ నుంచి హిమాయత్ నగర్ వరకు వారి కలిసే వచ్చారా? లేదా? అనే విషయాలు ఇంకా తెలియాల్సిఉంది. డైరెక్టర్ల సమావేశానికి వెళ్లేటప్పుడే డాక్టర్లలో ఒకరు ఆయుధం కలిగి ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.
Post a Comment