మార్కెట్‌లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా యాపిల్ ఐ-ఫోన్ ధరలు మాత్రం స్థిరంగా ఉంటాయి. అంతర్జాతీయంగా ఈ విషయం నిజమే అయినా భారత్ వచ్చేసరికి యాపిల్ కంపెనీకి కూడా ధరలు తగ్గించక తప్పని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఐ-ఫోన్6 ఎస్ ధర ఇటీవలకాలంలో గణనీయంగా తగ్గింది. తాజాగా ఈ మోడల్ ధర 27శాతం పడిపోయి.. ఏకంగా రూ. 45వేలకే కొన్ని ఈ కామర్స్ సైట్లలో లభిస్తున్నది.
యాపిల్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా 64 జీబీ మోడల్ ఐఫోన్-6ఎస్‌ను గత ఏడాది అక్టోబర్‌లో భారత మార్కెట్‌లో విడుదల చేసింది. లాంచ్ చేసిన సమయంలో దీని ధర అక్షరాల రూ. 62వేలు. ఇప్పుడు గోల్డ్ కలర్ ఐఫోన్ 6ఎస్ మోడల్ కేవలం రూ. 44,799లకే అమెజాన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అంటే ఈ మోడల్ ధర 27శాతం తగ్గింది. ఇక 64 జీబీ గ్రే కలర్ మోడల్ ధర మొదట్లో రూ. 72వేలు ఉండగా.. ఇప్పుడు అది రూ. 57,699కే లభిస్తున్నది.
పీటీఎంలోనూ ఐఫోన్ 6ఎస్ తక్కువ ధరకు లభిస్తున్నది. 6ఎస్ 128 జీబీ మోడల్ వాస్తవ ధర రూ. 82వేలు కాగా.. 20శాతం డిస్కోంట్ తో రూ. 65,490లకే ఈ ఫోన్ లభిస్తున్నది. పీటీఎంలో ఐఫోన్ 6ఎస్ 64 జీబీ బేస్ మోడల్ రూ. 66,489కి లభిస్తుండగా, ఫ్లిప్‌కార్ట్‌లో ఇదే మోడల్ రూ. 49,999కి లభిస్తున్నది.
భారత మార్కెట్‌లో భారీగా తన వాటా పెంచుకోవాలని భావిస్తున్న యాపిల్ కంపెనీ ఐఫోన్ 6ఎస్ విషయంలో చేదు అనుభవమే ఎదురైంది. 2014, 2015 సంవత్సరాల్లో ఐఫోన్ 6 సాధించిన అమ్మకాలను.. 6ఎస్ మోడల్ సాధించకపోవడంతో వాటి ధరలు దిగివచ్చినట్టు పరిశీలకులు చెప్తున్నారు.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

Post a Comment