-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

February 27, 2016

70 ఆస్తుల వివరాలను దాచి పెట్టారు


♦ అగ్రిగోల్డ్ వ్యవహారంలో బయటపడ్డ కొత్త విషయం
♦ హైకోర్టుకు నివేదించిన సీఐడీ అధికారులు
♦ విస్మయం వ్యక్తం చేసిన ధర్మాసనం
♦ దాచిన ఆస్తులను వెంటనే జప్తు చేయండి
♦ సీఐడీ అధికారులకు హైకోర్టు ఆదేశం
♦ విచారణ రెండు వారాలకు వాయిదా
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ డిపాజిట్ల ఎగవేత వ్యవహారంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అగ్రిగోల్డ్ యజమానులు రూ.కోట్ల విలువైన 70 ఆస్తుల వివరాలను కోర్టుకు చెప్పకుండా దాచిపెట్టినట్లు సీఐడీ అధికారులు హైకోర్టుకు నివేదించారు. ఇప్పటికే కోర్టు ముందుంచిన ఆస్తుల వివరాలు కాక మరో 70 ఆస్తుల గురించి యజమానులు కస్టోడియల్ విచారణలో వెల్లడించారన్నారు.దీనిపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. తాము అగ్రిగోల్డ్ యజమానులను మొదటి నుంచీ సందేహిస్తూనే ఉన్నామని, అందుకే వారి అరెస్ట్ గురించి పదే పదే చెప్పామని వ్యాఖ్యానించింది. ఆస్తుల వివరాలను దాచిపెట్టి అగ్రిగోల్డ్ యాజమాన్యం కోర్టును మోసం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణలో యాజమాన్యం వెల్లడించి న ఆస్తుల వివరాలను తమ ముందుంచాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. వెల్లడించకుండా దాచిన ఆస్తులు మరిన్ని ఉండే అవకాశం ఉందని, అందువల్ల నిందితులను పూర్తి స్థాయిలో విచారించాలంది. ఈ 70 ఆస్తులను వెంటనే జప్తు చేయాలని, వెంటనే దీనిపై ఉత్తర్వులు జారీ చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంతో సమాచార మార్పిడి చేసుకోవాలంది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈమేరకు తాత్కాలిక ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.
 భారీగానే నిధుల మళ్లింపు
నిధుల మళ్లింపు వ్యవహారంలో దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని ధర్మాసనం ప్రశ్నించగా.. రూ.10కోట్లు మళ్లించారని ఆంధ్రప్రదేశ్ ఏఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ బదులిచ్చారు. అది చాలా చిన్న మొత్తమని, భారీగా నిధుల మళ్లింపు జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసింది.
 ఇప్పటికైనా వివరాలన్నీ చెప్పండి
‘‘ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఇప్పటివరకు వెల్లడించని ఆస్తుల వివరాలను స్వచ్ఛందంగా ముందుకొచ్చి కోర్టు ముందుం చండి’’ అని అగ్రిగోల్డ్ యాజమాన్యానికి ధర్మాసనం సూచించింది. సహారా కేసులో ఏం జరిగిందో మర్చిపోవద్దని గుర్తు చేసింది. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్ స్పందిస్తూ... ఏపీ సీఐడీ నుంచి తమకు సహకారం అందడం లేదని ఫిర్యాదు చేశారు. దీన్ని ఏపీ అదనపు ఏజీ ఖండించారు. ధర్మాసనం స్పందిస్తూ... పోట్లాటలు మాని, పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని సూచించింది. హైదరాబాద్‌లోని అగ్రిగోల్డ్ ప్రధాన కార్యాలయాన్ని రూ.25 కోట్లకు వేలం వేసేందుకు ఆంధ్రాబ్యాంకు ప్రకటన జారీ చేసిందని  పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పగా... ఆ వివరాలు తమ ముందుం చాలని ధర్మాసనం ఆదేశించింది.
వేలానికి ఎక్కువ  స్పందన వచ్చేలా చర్యలు
సామాన్య ప్రజల  నుంచి అగ్రిగోల్డ్ యాజ మాన్యం రూ.వేల కోట్లు వసూలు చేసి, తిరిగి చెల్లించకుండా ఎగవేసిందని, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎ.రమేష్‌బాబు, మరికొందరు హైకోర్టులో పిల్‌లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను హైకోర్టు ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. హైకోర్టు ఏర్పాటు చేసిన అగ్రిగోల్డ్ భూముల వేలం పర్యవేక్షణ కమిటీ తరఫున న్యాయవాది రవిప్రసాద్ వాదనలు వినిపించారు. వేలానికి ఎక్కువ స్పందన వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. కమిటీ నిర్ణయాలను లిఖితపూర్వకంగా కోర్టు ముందుంచారు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu