-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

February 17, 2016

అతడి వయస్సు 50 ఏళ్లు.. కానీ 12ఏళ్లే అని డాక్టర్లంటున్నారు..!



రక్త సంబంధం కలకాలం నిలుస్తుంది. ఆత్మీయానురాగాలకు ఇది తరగని గని. రక్తం పంచుకుని పుట్టిన పిల్లలపై తల్లికి ఉండే ప్రేమాభిమానాలకు అంతు ఉండదు. కన్న పిల్లలు కనీసం ఒక్క క్షణం కనిపించకపోయినా ఆ తల్లి పడే ఆవేదన అంతా ఇంతా కాదు. అలాంటిది కెనడాకు చెందిన ఓ తల్లి తన కొడుకు అదృశ్యమవడంతో 30 ఏళ్లపాటు తీవ్ర మనోవేదన అనుభవించింది. తన కొడుకు సజీవంగా ఉండే అవకాశం లేదని నిర్ణయానికి వచ్చేసింది. అయితే తన కొడుకు బతికే ఉన్నాడని తెలియడంతో ఆమె సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది.

ఒంటారియో ప్రావిన్స్‌లోని వికలాంగుల ఆశ్రమం నుంచి 21 ఏళ్ల వయసున్న ఎడ్గార్ లతులిప్ అనుకోకుండా 30 ఏళ్ల క్రితం అదృశ్యమయ్యాడు. అతను ఓ బస్సు ఎక్కి వెళ్లాడని, ఆ తర్వాత జరిగిన ప్రమాదంలో తలకు బలంగా గాయమైందని, అప్పటి నుంచి అతను తన గతాన్ని మరచిపోయాడని పోలీసులు చెప్తున్నారు. ఆ తర్వాత నయాగరాలో వేరే పేరుతో దశాబ్దాలపాటు నివసించాడు.
ఓ సామాజిక కార్యకర్త ఇతని పరిస్థితిని గమనించి, బహుశా ఇంటి నుంచి తప్పిపోయి, ఇక్కడికి వచ్చి ఉంటాడని అనుమానించారు. డీఎన్ఏ టెస్ట్‌ చేయడంతో లతులిప్ వివరాలు తెలిశాయి. ఆ సమాచారాన్ని టీవీ ఛానళ్లు ప్రసారం చేయడంతో ఒట్టావాలో ఉంటున్న అతని తల్లి సిల్వియా విల్సన్ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. లతులిప్ ఆత్మహత్యా యత్నం చేసిన తర్వాత ఆసుపత్రిలో కోలుకుంటున్న సమయంలో అతనిని ఆమె చివరిసారిగా చూశారు. ఆ తర్వాత అతనిని ఎవరైనా చంపేసి ఉంటారని, లేదంటే అతనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ఆమె భావించారు. ప్రస్తుతం లతులిప్ వయసు 50 ఏళ్లు. కానీ మానసికంగా అతను పన్నెండేళ్ల వయసువాడు మాత్రమేనని ఉత్తర అమెరికా మిస్సింగ్ పర్సన్స్ నెట్‌వర్క్ పేర్కొంది. ఈ తల్లీకొడుకులు త్వరలోనే కలవబోతున్నారు. వికలాంగుడైన తన కొడుక్కి తాను సేవలు చేస్తానని సిల్వియా చెప్పారు.


When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu