హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో కాపులకు, బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతాలు, మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు వెనుకాడడం లేదని విమర్శించారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని హామీయిచ్చి మాట తప్పారని ధ్వజమెత్తారు. సోమవారం మధ్యాహ్నం వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి వైఎస్ జగన్ విలేకరులతో మాట్లాడారు. కాపుల డిమాండ్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు నాయుడు నిన్న చాలా సుదీర్ఘమైన ఆత్మస్తుతి.. పరనింద కార్యక్రమం కొనసాగించారు. అందుకే నేను మాట్లాడాల్సి వచ్చింది. చంద్రబాబు మాట్లాడిన తీరుచూస్తే, ఇంత చీప్‌గా ఒక సీఎం మాట్లాడటం ఏపీ చరిత్రలోనే ఎప్పుడూ లేదు. సీఎం రాజకీయాల కోసం ఇంత దిగజారగలరా?
తాను తప్పులు చేసి, ఆ తప్పులు వేరేవాళ్లమీద మోపడానికి ఆయన ఇంత దిగజారుతారా అనిపించింది
అలా మాట్లాడినందుకు చంద్రబాబు సిగ్గుపడాలి
రకరకాల ఆరోపణలు చేశారు
కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు అన్నారు
దానికి కారణం వైఎస్ఆర్‌సీపీయేనంటారు
ఆరు మీడియా ఛానళ్లకే ముందెలా తెలిసిందంటారు
ఇదంతా చేసింది వైఎస్ఆర్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలేనంటారు
పట్టిసీమ నుంచి రాయలసీమ, కాల్ మనీ వరకు అన్నీ మాట్లాడారు
నేరస్తులు అంటారు, కరప్షన్ అంటారు
కాపులు కేవలం 5-10 శాతం మందే పాల్గొన్నారని నోటికొచ్చినట్లు మాట్లాడారు
పులివెందులలో ఇలా జరిగినా పర్వాలేదు, తూర్పుగోదావరి జరగడం ఆశ్చర్యం అంటారు
ఈ నెల జీతాలు ఇవ్వడానికే కష్టంగా ఉందని, అప్పులు తెచ్చే పరిస్థితి కూడా లేదని అంటారు
కమిషన్ ఒప్పుకోకపోతే కాపుల రిజర్వేషన్ ఇవ్వడానికి మేమేం చేయలేం అని చెప్పారు
అంతసేపు మాట్లాడినా.. కాపులకు తానేం చేస్తానో, ఎప్పుడు చేస్తానో మాత్రం ఎక్కడా లేదు
తనమీద తప్పు రాకుండా చూసుకోడానికి అవతలివాళ్ల మీద అభాండాలు వేస్తున్నారు
ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో, కాపులకు సంబంధించి ఒక లావు పేజీ పెట్టారు
కాపులకు రిజర్వేషన్ విషయమై ప్రత్యేక కమిషన్ నియమించి, నిర్ణీత కాలవ్యవధిలో సమస్య పరిష్కరిస్తా అన్నారు
ఐదేళ్లలో ఐదు వేల కోట్లు కేటాయించి వారి సంక్షేమానికి ఖర్చుచేస్తానని చెప్పారు
22 నెలలు అయిపోయింది, ఆ పనులు ఎందుకు చేయట్లేదని, ఎప్పుడు చేస్తావని ఉద్యమబాట పట్టారు
కాపు సామాజిక వర్గం వాళ్లు లక్షల్లో కదిలి అడిగారు
దానికి సమాధానం చెప్పకుండా అవతలి వాళ్లమీద అభాండాలు వేస్తున్నారు
అసలీయన నిజంగా ముఖ్యమంత్రేనా
ఇదే చంద్రబాబు తన మాటల్లో రకరకాల ఆరోపణలు చేశారు
ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల, మోసం చేసినందువల్ల ప్రజల్లో ఫ్రస్ట్రేషన్ వచ్చింది
వాళ్లు ఫలానా జిల్లా, ఫలానా ప్రాంతం, ఫలానా కులం అని లేదు
అన్ని కులాల్లో, మతాల్లో, జిల్లాల్లో, ప్రాంతాల్లో ఫ్రస్ట్రేషన్ ఉంది
రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పలేదా?
డ్వాక్రా అక్క చెల్లెళ్ల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పలేదా?
బాబు వస్తే జాబు వస్తుందని, ఉద్యోగం ఇవ్వకపోతే ఇంటికి 2వేల నిరుద్యోగ భృతి ఇస్తానని అనలేదా?
వాళ్లందరినీ మోసం చేసినందుకు నువ్వు క్రిమినల్ నెంబర్ 1 అని ఎందుకు అనకూడదు?
బీసీలకు నష్టం జరగకుండా కాపులను బీసీలలో చేరుస్తానని చెప్పావు
ఎన్నికలప్పుడు చెప్పి, ఇప్పుడు చేయడం లేదు
ప్రతి విషయంలోను మాట ఇచ్చింది నువ్వే..
అనంతపురంలో బోయలను ఎస్టీలుగా చేస్తానని మేనిఫెస్టోలో పెట్టావు, ఇప్పుడు చేయలేదు
ప్రతి కులాన్నీ, వర్గాన్ని, ప్రాంతాన్ని మోసం చేశావు
అమరావతిలో రాజధాని పెట్టడానికి మేం వ్యతిరేకమని అభాండం వేస్తారు
రైతుల నుంచి బలవంతంగా భూముల సేకరణనే మేం ప్రశ్నించాం
మీ బినామీలు మురళీమోహన్, నారాయణ లాంటివాళ్ల భూములు ముట్టుకోవు
ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన డీకేటీ భూములను కూడా లాక్కుంటావు
పోలవరం కట్టాలని అడిగితే.. కమీషన్ల కోసం పట్టిసీమ కడతావు
అది కూడా కమీషన్లు తీసుకుని 22 శాతం ఎక్సెస్‌కు ఇస్తావు
గట్టిగా నిలదీస్తే రాయలసీమకు వైఎస్ఆర్‌సీపీ వ్యతిరేకి అని ప్రచారం చేస్తావు
కాల్‌మనీలో నీకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రమేయం ఉంది, అరెస్టు చేయాలని అడిగితే.. స్టేషన్‌లోనే బెయిల్ ఇచ్చి పంపిస్తావు
ఆడవాళ్ల జీవితాలతో చెలగాటం ఆడుతున్నావని ప్రశ్నిస్తే.. కాల్ మనీ మీద వైఎస్ఆర్‌సీపీ ప్రశ్నిస్తోంది, వీళ్లు విజయవాడకు వ్యతిరేకం అంటావు
పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కాపుల రిజర్వేషన్ కోసం కదిలారు
వాళ్ల మీద కూడా అభాండాలు వేస్తారు
అదే సమావేశానికి బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ హాజరైనా ఆయన పేరు చెప్పరు
అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు.. మీటింగ్ ను ఆపాలని చూశారు
నాలుగైదు నెలల కింద వాళ్లు చెబితే, దాన్ని ఆపేందుకు విశ్వప్రయత్నం చేశావు
మీ పార్టీ వాళ్లందరినీ హైదరాబాద్ పిలిపించుకుని ఆపేశావు
బస్సులు అడిగినా కూడా అరకొరగా మాత్రమే ఇచ్చి.. అది కూడా సమావేశ స్థలానికి 7-8 కిలోమీటర్ల దూరంలోనే ఆపేశావు
చివరకు వాళ్ల ఫ్రస్ట్రేషన్‌తో ఆడుకున్నావు
అయినా కూడా ఆ మీటింగ్ సక్సెస్ అయితే.. దానివల్ల ఉద్యమకారులకు, ప్రతిపక్షాలకు మంచిపేరు వస్తుందని, అది రాకూడదని, వాళ్లకు చెడ్డపేరు రావడం కోసం నువ్వు అలజడి క్రియేట్ చేసి చెడ్డపేరు వీళ్లకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నావు
ముద్రగడ పద్మనాభం మాట్లాడిన కొద్దిసేపటికే భావోద్వేగాల మధ్య రైల్ రోకోకు పిలుపునిచ్చారు
ఆయనతో పాటే మీడియా వాళ్లు అందరూ కూడా అక్కడకు వెళ్లారు
ఆరు ఛానళ్లే అంటున్నారు.. రాష్ట్రంలో ప్రతి ఛానల్ దాన్ని ప్రసారం చేసింది
ఎవరైనా దాన్ని కవర్ చేస్తే అది కూడా కుట్రలో భాగం అని అభాండాలు వేస్తున్నారు.
జరిగింది ఏంటి, నువ్వు ఎందుకు చేయలేకపోయావని ప్రశ్నిస్తే, వాళ్లమీద ఆరోపణలు చేస్తున్నావు
ఇదే క్రిమినల్ బుర్ర నీది కాదా?
1988లో ఇదే మాదిరిగా తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయవాడలో కాపునాడు సభ జరిగింది.
అదే సంవత్సరంలో వంగవీటి రంగాను హత్య చేయించావు
హరిరామ జోగయ్య తన పుస్తకంలో లేఖ రాశారు.. అందులో చంద్రబాబు పాత్ర ఉందని అన్నారు.
ముద్దాయిల్లో ఒకరు స్పీకర్ స్థానంలోను మరొకరు మంత్రి (ఉమా) ఉన్నారు. ఇంకొకరు ఎమ్మెల్యే
అన్నీ దుర్మార్గపు ఆలోచనలు, క్రిమినల్ బుద్ధి ఉన్నది చంద్రబాబుకే
ఇవా రాజకీయాలంటే? రాజకీయాలు స్ఫూర్తినిచ్చేలా ఉండాలి
మేనిఫెస్టోలో పెట్టావు కాబట్టే అడుగుతున్నారు
బీసీలు ఎందుకు ఒప్పుకోరు.. వాళ్లకు నష్టం జరగనివ్వకుండా చేస్తే ఎందుకు ఒప్పుకోరు?
నీ పార్టీకి చెందిన బీసీ ఎమ్మెల్యే కృష్ణయ్యతో స్టేట్‌మెంట్లు ఇప్పిస్తావు
అదే కృష్ణయ్య నీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత నీ పార్టీ తరఫున పోటీ చేయలేదా?
ప్రతి వర్గానికి మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు
గతంలో ఎస్సీ వర్గీకరణ పేరు చెప్పి మాలలు, మాదిగల మధ్య చిచ్చు పెట్టావు
అందుకు రాజ్యాంగ సవరణ అవసరం అని నీకు తెలియదా?
నువ్వు పెట్టిన చిచ్చు ఎస్సీల మధ్య ఇప్పటికీ ఉంది
రాజకీయాల కోసం ప్రాంతాలు, కులాలు, వర్గాల మధ్య చిచ్చుపెట్టడం నీకే అలవాటు
తనంత గొప్ప నాయకుడు ఎవరూ లేరని మాటిమాటికీ ఆయన అబద్ధాలు చెబుతుంటారు
సెల్‌ఫోన్ తానే తెచ్చానంటాడు, మా ఖర్మ.. వినాల్సి వస్తోంది
ఇదే చంద్రబాబు హయాంలో ఐటీ ఎగుమతుల్లో ఏపీ షేర్ 8.66 శాతం ఉంటే, వైఎస్ హయాంలో 14.93 శాతానికి పెరిగింది.
ఐటీ ఉద్యోగులు చంద్రబాబు హయాంలో 85 వేల మంది ఉంటే, వైఎస్ హయాంలో 2 లక్షలకు పైగా ఉన్నారు
వాస్తవాలు ఇవైతే.. వాటిని వక్రీకరించడంలో, అబద్ధాలు చెప్పడంలో ఆయనను మించినవాళ్లు లేరు
కాపులకు సంబంధించిన విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నావు?
కాపుల డిమాండ్లకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం
బీసీలకు నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని కోరేవాళ్లలో మా పార్టీ ముందుంటుంది
1910 నుంచి రిజర్వేషన్లు ఉన్నాయి.. 1956 వరకు కాపులు బీసీలలోనే ఉన్నారు
1953లో తొలి బీసీ కమిషన్ ఖలేల్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికలో కూడా కాపులు బీసీలే
ఆ తర్వాత 1956 నుంచి నిర్దాక్షిణ్యంగా కాపులను ఒక జీవో ద్వారా బీసీల నుంచి తొలగించారు
ఆ అన్యాయాన్ని సరిచేయాలని వాళ్లు అడడగం సహేతుకం
అలా అడగడంలో తప్పేమీ లేదు
తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లున్నాయి
మరి ఎందుకు ఆ పద్ధతిలో మీరు చేయలేకపోతున్నారు?
1994లో తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి, షెడ్యూలు 9లో చేర్చేలా రాజ్యాంగ సవరణ చేయించారు
అందుకే అక్కడ 69 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి
ఇక్కడ నువ్వు మద్దతు ఇస్తున్న బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో ఉంది కాబట్టి, ఇక్కడ తీర్మానం చేసి షెడ్యూలు 9లో చేర్చేలా ఒత్తిడి తెస్తే 50 శాతం సీలింగ్ దాటి.. బీసీలకు నష్టం కలగకుండా కాపులకు రిజర్వేషన్ కల్పించొచ్చు
కానీ అలా ఎందుకు చేయడం లేదు?
మేం ఎవరితోనూ ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోమని, కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా, వాళ్లు మామీద ఆధారపడితే మేం రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్లపై ఒత్తిడి తెస్తామని చెప్పాం
కానీ కనీసం కేంద్రంలో ఉన్న తన మంత్రులను ఉపసంహరించుకునే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదు
అవి చేయించలేకపోతే కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు ఎందుకు మద్దతిస్తున్నారు?
నోరు తెరిస్తే మోసాలు.. అబద్ధాలు.. ఇదీ ఆయన చరిత్ర
జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని ఆయన మాట్లాడుతున్నారు
ఎఫ్ఆర్‌బీఎం పరిమితులు ఉన్నాయని, అప్పులు తేలేనని అంటారు
ఈయన చెప్పే మాటలకు ఎక్కడా పొంతన లేదు
గ్రోత్ రేటు 11.76 శాతం ఉందని, వచ్చే సంవత్సరం 15 శాతానికి తీసుకెళ్తామంటారు
కేంద్రం గత ఆరు నెలల కాలానికి 7.3 శాతం జీడీపీ గ్రోత్ రేటు చూపిస్తోంది
దానికే రెవెన్యూలో గ్రోత్ రేటు 23 శాతం, పరోక్ష పన్నులు మరింత ఎక్కువ చెబుతోంది
మనకు ప్రధానంగా ఆదాయం వచ్చేది పరోక్ష పన్నుల ద్వారానే
ఆ లెక్కన 11.76 శాతం గ్రోత్ రేటు ఉంటే ఇక్కడ రెవెన్యూ గ్రోత్ రేటు ఇంకెంత ఉండాలి
ఇంత గ్రోత్ రేటు చూపిస్తే జీతాలకు డబ్బులెందుకు లేవు?
ఇదే చంద్రబాబు కబడ్డీ పోటీలకు వెళ్లి తొడగొడతారు
అక్కడకు వెళ్లి.. అమరావతికి ఒలింపిక్స్ తెస్తామంటారు
మొన్న చైనాలో ఒలింపిక్స్ జరపడానికి ఆ ప్రభుత్వం 42 బిలియన్ డాలర్లు.. అంటే 3.5 లక్షల కోట్లు ఖర్చుపెట్టింది
మన మనిషి కబడ్డీ కబడ్డీ అంటూ తొడగొట్టి అమరాతిలో ఒలింపిక్స్ అంటారు
సింగపూర్ వెళ్లొచ్చి, అమరావతిని సింగపూర్ చేస్తానంటారు
చైనా వెళ్లొచ్చి, అమరావతిని బీజింగ్ చేస్తానంటారు
ఇంత కంటే దారుణమైన మనిషిని జీవితంలో ఎప్పుడూ చూడలేదు
ఈవాళ ఒకే ఒక్క విషయంలో మాత్రం కాపు సామాజిక వర్గానికి రిక్వెస్ట్ చేస్తున్నా
మన పోరాటం పూర్తి సమంజసం
మేనిఫెస్టోలో పెట్టిందే అడుగుతున్నాం.. తప్పు కాదు
అందరం కలిసికట్టుగా సాధించే దిశగా అడుగులు వేస్తాం
సంయమనం పాటించండి. ఎక్కడైనా విధ్వంసం చేస్తే మాత్రం మనకు చెడ్డపేరు ఆపాదించే ప్రయత్నం చంద్రబాబు చేస్తారు
Post a Comment