-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

January 05, 2016

General knowledge in telugu - Types of Fuels


సిలిండర్‌లో ఉండే వంటగ్యాస్‌ రూపం ?

సాంకేతిక అభివృద్ధి చెందడంతో అనేక రకాలుగా ఇంధనాలను వెలికితీసి ఉపయోగిస్తున్నారు. కానీ పూర్వం ఏ ఇంధనమూ లేని రోజుల్లో మానవులు కర్రను ఇంధనంగా ఉపయోగించేవారు.

 లోహాలను కరిగించడానికి చార్‌కోల్‌(బొగ్గు) వాడేవారు.

 మొట్టమొదటిసారిగా బొగ్గును ఇంధనంగా ఉపయోగించిన దేశం చైనా.
 ఆ తర్వాత బ్రిటన్‌. 

నేడు అన్ని దేశాలూ భూగర్భంలోనించి ఇంధనాన్ని వెలికితీసి ఉపయో గిస్తున్నారు. 
అసలు ఇంధనం అంటే ఏమిటి..? 
అది ఎన్ని రకాలుగా లభిస్తుంది? 
వాటి అనువర్తనాల గురించి తెలుసుకుందాం... 

ఇంధనాలు - రకాలు
 గాలి లేదా ఆక్సిజన్‌ సమక్షంలో మండినప్పుడు ఎక్కువ ఉష్ణశక్తిని ఇచ్చే పదార్థాన్ని ఇంధనం అంటారు. 
ఇంధనం మండటం వల్ల విడుదలయ్యే ఉష్ణశక్తిని కెలోరిఫిక్‌ విలువల్లో లెక్కిస్తారు. 
కెలోరిఫిక్‌ విలువ : ఒక కిలోగ్రాం (కెజి) ఇంధనం పూర్తిగా దహనమై ఉత్పత్తి చేసే ఉష్ణశక్తిని ఆ ఇంధన కెలోరిఫిక్‌ విలువ అంటారు.

 ఇంధనాల వర్గీకరణ 

1. ఇంధనాలను అవి లభించే భౌతిక స్థితిని బట్టి మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. 
ఎ. ఘన ఇంధనాలు
 బి. ద్రవ ఇంధనాలు
 సి. వాయు ఇంధనాలు - 
బొగ్గు, కోక్‌, చార్‌కోల్‌, పారాపిన్‌వాక్స్‌ మొదలైనవి ఘన ఇంధనాలు
. - పెట్రోలియం, డీజిల్‌, పెట్రోల్‌, కిరోసిన్‌ ఆయిల్‌, ఎల్‌పీజీ, కోల్‌తార్‌, ఇథనాల్‌ మొదలైనవి ద్రవ ఇంధనాలు. 
- హైడ్రోజన్‌, కోల్‌గ్యాస్‌, వాటర్‌ గ్యాస్‌, ప్రొడ్యూసర్‌ గ్యాస్‌, సీఎన్‌జీ, గోబర్‌గ్యాస్‌ మొదలైనవి వాయు ఇంధనాలు. 
2. ఇంధనాలు లభించే విధానాలు మూడు రకాలు. 
ఎ. శిలాజ ఇంధనాలు
 బి. బయో ఇంధనాలు 
సి. అణు ఇంధనాలు - 
నేలబొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులు జీవుల మృత అవశేషాల నుంచి తయారవుతాయి. అందుకే వీటిని శిలాజ ఇంధనాలు అంటారు. 
- బయోమాస్‌, బయోగ్యాస్‌, బయోడీజిల్‌, బయో ఇథనాల్‌ అనేవి బయో ఇంధనాలకు ఉదాహరణలు. 
- యురేనియం, థోరియం, ప్లూటోనియం మొదలైనవి రేడియోథార్మిక మూలకాలను అణుఇంధనాలు అంటారు.

3. ఇంధనాలను మరో రకంగా కూడా వర్గీకరించవచ్చు. 
ఎ. సాంప్రదాయ ఇంధన వనరులు 
బి. సాంప్రదాయేతర ఇంధన వనరులు 
- బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, అణు ఇంధనాలు మొదలైనవి సాంప్రదయా ఇంధన వనరులు. ఇవి రోజురోజుకీ అంతరించిపోయే ప్రమాదం ఉంది. అందుకే వీటిని తరిగిపోయే ఇంధనాలు లేదా పునర్వినియోగించబడని ఇంధన వనరులు అని కూడా అంటారు.
 - బయోమాస్‌, బయోగ్యాస్‌, బయోడీజిల్‌, సౌరశక్తి, తరంగశక్తి, వాయుశక్తి మొదలైనవి సంప్రదాయేతర ఇంధన వనరులు. వీటిని ఎంతైనా వినియోగించుకోవచ్చు. వీటిని తరిగిపోని శక్తి వనరులు లేదా పునర్వినియోగితమయ్యే ఇంధన వనరులు అని పిలుస్తారు.

 ఉత్తమమైన ఇంధనం దక్షత, లభ్యతను బట్టి తక్కువ కాలుష్య కారకాలను విడుదల చేసేవి. మండించినప్పుడు తక్కువ బూడిద ఏర్పరుస్తూ, అధిక కోలోరిఫిక్‌ విలువ కలిగి ఉన్న ఇంధనాలను ఉత్తమమైనవిగా పేర్కొంటారు.
 ఘన, ద్రవ, వాయు ఇంధనాల్లో వాయు ఇంధనాలు మెరుగైనవి.
 ఎందుకంటే ..వీటి నిల్వ, సరఫరా, ఘన, ద్రవ ఇంధనాల కంటే సులభం. మండించినప్పుడు బూడిదను కూడా ఏర్పరచవు.

 ఇంధనం పేరు కెలోరిఫిక్‌ విలువ(కిలోజైల్‌/కెజి
 ఎ. బొగ్గు 26,000-31,000
 బి. డీజిల్‌ 45,000
 సి. పోట్రోల్‌ 45,000 
డి. సీఎన్‌జీ 51,000 
ఇ. ఎల్‌పీజీ 56,000 
బొగ్గు (కోల్‌) భూమిలో కొన్ని శతాబ్దాల కిందట మట్టితో కప్పబడిన వృక్ష సంబంధ పదార్థాలు ఆక్సిజన్‌ సమక్షంలో అధిక పీడనం, ఉష్ణోగ్రతల వద్ద కృశించిపోయినప్పుడు బొగ్గు ఏర్పడుతుంది. బొగ్గు ఏర్పడే చర్యను కార్బోనైజేషన్‌ అంటారు. ఇది జీవ పదార్థాల అవశేషాల నుంచి ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని శిలాజ ఇంధనం అంటారు. దీనిలో ప్రధానంగా ఉండేది కార్బన్‌. దీంతోపాటు కొద్ది మొత్తంలో హైడ్రోజన్‌, ఆక్సిజన్‌, నైట్రోజన్‌లు కూడా ఉంటాయి. 

- బొగ్గులో ఉండే కార్బన్‌ శాతాన్ని బట్టి నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు.
 ఎ. ఆంత్రనైట్‌ బొగ్గు
 బి. బిట్యూమినస్‌ బొగ్గు 
సి. లిగ్నైట్‌ బొగ్గు
 డి. పీట్‌ 
- ఆంత్రనైట్‌ బొగ్గులో అత్యధికంగా కార్బన్‌ ఉండటంతో దాన్ని పరిశుద్ధమైన బొగ్గు అంటారు. 
లిగ్నైట్‌ బొగ్గును బ్రౌన్‌ కోల్‌ అని కూడా పిలుస్తారు. 
బొగ్గు నుంచి కోల్‌ గ్యాస్‌, వాటర్‌ గ్యాస్‌, సెమీవాటర్‌ గ్యాస్‌, కృత్రిమ పెట్రోల్‌ తయారు చేస్తారు. 
బొగ్గు రకం అందులో ఉండే కర్బన శాతం
 ఎ. ఆంత్రసైట్‌ 90 
బి. బిట్యూమినస్‌ 80 
సి. లిగ్నైట్‌ 70 
డి. పీట్‌ 60

 కోక్‌ :-
బొగ్గును ఆక్సిజన్‌ లేకుండా నిర్వాత స్వేదనం చెందిస్తే కోక్‌ ఏర్పడుతుంది. ఇందులో 80-95శాతం కార్బన్‌ ఉంటుంది. దీన్ని లోహ సంగ్రహణంలో, స్టీల్‌ పరిశ్రమల్లో, వంట చెరకు కోసం ఇంధనంగా ఉపయోగిస్తారు. 
వెంటిలేటర్స్‌ లేని గదిలో కోల్‌ లేదా కోక్‌ను మండిస్తే కార్బన్‌ మోనాక్సైడ్‌ వెలువడుతుంది. ఇది ప్రమాదకరమైన విషవాయువు.
 కోల్‌ గ్యాస్‌ :-
నేల బొగ్గు నుంచి కోక్‌ను పొందే ప్రక్రియలో కోల్‌గ్యాస్‌ ఉత్పత్తి అవుతుంది. ఇందులో 45శాతం హైడ్రోజన్‌ వాయువు ఉంటే మిగిలింది మీథేన్‌, ఇతర వాయువులు. దీని కెలోరిఫిక్‌ విలువ 21,000 కిలోజౌల్‌ / మోల్‌.

 పెట్రోలియం:-
 పెట్రోలియం అంటే రాతి నూనె అని అర్థం. దీన్నే చమురు (క్రూడ్‌ ఆయిల్‌) అంటారు. ఇది ఒక హైడ్రోకార్బన్‌ సమ్మేళనాల మిశ్రమం. కొన్నివేల సంవత్సరాల కిందట జంతువులు, వృక్షాలు, ప్లాంక్‌టన్‌ లాంటి సూక్ష్మజీవుల అవశేషాలు భూగర్భంలో కలిసిపోయి, అధిక ఉష్ణోగ్రత, పీడనానికి గురవడం వల్ల పెట్రోలియం ఏర్పడుతుంది. పెట్రోలియం నుంచి పెట్రోల్‌ డీజిల్‌, కిరోసిన్‌, ఎల్‌పీజీ ఉత్పత్తి చేస్తారు. - వ్యాపారపరంగా పెట్రోలియానికి చాలా ప్రాధాన్యం ఉండటంతో దీన్ని నల్ల బంగారం అని పిలుస్తారు. - పెట్రోలియం ఘనపరిమాణాన్ని బారెల్‌లో కొలుస్తారు. - ఒక బారెల్‌ 159 లీటర్లకు సమానం.
 పెట్రోల్‌ :-
 పెట్రోలియం లేదా క్రూడ్‌ ఆయిల్‌ను అంశిక స్వేదనం చెందిస్తే పెట్రోల్‌ ఏర్పడుతుంది. దీన్నే గ్యాసోలిన్‌ అని కూడా పిలుస్తారు. ఇందులో హైడ్రోకార్బన్‌లు ఉంటాయి. దీన్ని వాహనాల్లో ఇంధనంగా ఉపయోగిస్తారు. పెట్రోల్‌లో ప్రతి విస్పోటనకారిణిగా టెట్రాఇథైల్‌ లెడ్‌ (టెల్‌)ను కలుపుతారు

. డీజిల్‌ : -
దీన్ని పెట్రోలియం నుంచి సంగ్రహిస్తారు. ఇది హైడ్రోకార్బన్‌ మిశ్రమం. ఇది కూడా వాహనాల్లో ఇంధనంగా ఉపయోపడుతుంది. దీనిలో 75శాతం సంతృప్తి హైడ్రోకార్బన్‌లు, 25శాతం నాఫ్తలీన్‌, ఆల్కైల్‌ బెంజీన్‌ ఉంటాయి. 

కిరోసిన్‌ : -
పెట్రోలియాన్ని అంశిక స్వేదనం చెందిస్తే కిరోసిన్‌ ఏర్పడుతుంది. ఇందులో హైడ్రోకార్బన్‌లు అధికంగా ఉంటాయి. దీన్ని దీపాలు, స్టౌలలో ఇంధనంగా ఉపయోగిస్తారు. కిరోసిన్‌ను ల్యాంప్‌ ఆయిల్‌ అంటారు. 

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu