ఉసురుతీసిన క్షణికావేశం
భార్యతో స్వల్ప వాగ్వాదం.. ఆపై ఆత్మహత్య
మృతునిది గుంటూరు జిల్లా
హిరమండలం (ఎల్.ఎన్.పేట): క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్యభర్తల మధ్య జరిగిన స్వల్ప వివాదం చివరికి భర్త బలవన్మరణానికి ప్రేరేపించింది. హిరమండలం మేజర్ పంచాయతీ బ్యారేజ్ సెంటర్‌లో నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాకు చెందిన ఉయ్యాల ఏసురత్నం(25) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు అందించిన వివరాలు ప్రకారం... గుంటూరు జిల్లా ఈవూరు మండలం కొండ్రముట్ల గ్రామానికి చెందిన ఏసురత్నం తన భార్య తిరుపతమ్మతో రెండు నెలల క్రితమే స్థానిక బ్యారేజ్ సెంటర్‌లో ఒక ఇంట్లో అద్దెకు దిగారు. వీరు రైతులకు నూర్పులకు అవసరమయ్యే టార్పలిన్లు అద్దెకు ఇస్తుంటారు. ఆదివారం ఉదయం భార్య భర్తల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.
వెంటనే ఇంట్లో వేరే గదిలో భార్యను ఉంచేసి ఉరి వేసుకుని మృతిచెందాడని పోలీసులు చెప్పారు. బయట ఉన్న గది నుంచి పరుగున వీధిలోకి వెళ్లిన భార్య, కొందరిని పిలుచుకుని వచ్చి తలుపులు తీసేలోగా మృతి చెందాడన్నారు. వీరికి వివాహం జరిగి మూడు సంవత్సరాలే అయిందని, ఎప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, చిన్నపాటి గొడవతో క్షణికావేశానికి లోనై బలవన్మరణానికి పాల్పడ్డాడని భార్య మేనమామ వెంకటేష్ రోదిస్తూ చెప్పాడు. కళ్లముందే భర్త చనిపోవడంతో భార్య గుండెలవిసేలా రోదిస్తోంది. అక్కడికి చేరుకున్న వారు కూడా ఆమెను ఓదార్చలేకపోతున్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై కె.వెంకటేశ్వరరావు చెప్పారు.

Post a Comment