-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

January 06, 2016

ముఖ్యమైన దినోత్సవాలు..

worldenvironmentఅంతర్జాతీయ దినోత్సవాలు
  • మార్చి 8: ప్రపంచ మహిళా దినోత్సవంగా పాటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ, సాంఘిక రంగాలలో మహిళల విజయాలకు గుర్తింపుగా నిర్వహిస్తారు. జర్మనీకి చెందిన క్లారా జెట్‌కిన్ 1910లో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతిపాదించారు. మొదటి దినోత్సవాన్ని 1911లో మార్చి 19న పాటించారు. 1913 నుంచి మార్చి 8న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి 1975ను అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించింది.
  • మార్చి 20: అంతర్జాతీయ సంతోష దినంగా పాటిస్తారు. ఇందుకోసం ఐరాస భూటాన్‌ను ఆదర్శంగా తీసుకొని మార్చి 20ని అంతర్జాతీయ సంతోష దినంగా ప్రకటించింది.
  • ఏప్రిల్ 7: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ఏప్రిల్ 7, 1948న ఏర్పాటైంది. అందువల్ల ఏప్రిల్ 7ను ప్రపంచ ఆరోగ్యదినంగా పాటిస్తారు. 2013లో ఈ దినం ముఖ్య ఉద్దేశం.. అధిక రక్తపీడనాన్ని నియంత్రణలో ఉంచడం.
  • మే 31: పొగాకు వ్యతిరేక దినం లేదా ధూమపాన వ్యతిరేక దినంగా మే 31ని పాటిస్తారు. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ఆరు మిలియన్ల ప్రజలు పొగాకు వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. పొగాకు వాడకం వల్ల కలిగే రుగ్మతల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ దినాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తోంది.
  • జూన్ 5: ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ) జూన్ 5వ తేదీని ప్రపంచ పర్యావరణ దినంగా నిర్వహిస్తోంది. 1972 నుంచి దీన్ని పాటిస్తున్నారు. పర్యావరణంపై అవగాహనను పెంపొందించడానికి ప్రతి ఏటా నిర్వహిస్తారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, ఆహార పదార్థాలను వ్యర్థం చేయకపోవడం వంటి అంశాలపై ప్రజలు దృష్టి కేంద్రీకరించాలని ఈ దినాన్ని పాటిస్తారు.
  • జూలై 11: ఐక్యరాజ్యసమితి అభివృద్ధి పథకం (యూఎన్‌డీపీ) 1989లో ప్రపంచ జనాభా దినాన్ని ప్రకటించింది. ప్రతి ఏటా జూలై 11న నిర్వహిస్తారు. ప్రపంచ జనాభా సమస్యలపై అవగాహన కోసం దీన్ని పాటిస్తారు. ప్రస్తుత ప్రపంచ జనాభా 700 కోట్లను దాటింది.
  • సెప్టెంబర్ 8: యునెస్కో సెప్టెంబర్ 8ని అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవంగా ప్రకటించింది. మొదటిసారి 1966లో నిర్వహించారు. సమాజానికి, ప్రజలకు అక్షరాస్యత ఆవశ్యకత గురించి తెలియచేయడానికి దీన్ని పాటిస్తారు. 2013 సంవత్సరానికిగానూ ప్రధాన అంశం.. ‘21 వ శతాబ్దానికి అక్షరాస్యతలు’. 2003-2012 దశాబ్దాన్ని ఐక్యరాజ్య సమితి అక్షరాస్యతా దశాబ్దంగా ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 1990ని అంతర్జాతీయ అక్షరాస్యతా సంవత్సరంగా నిర్దేశించింది.
  • సెప్టెంబర్ 16: ఐక్యరాజ్యసమితి సెప్టెంబర్ 16ను అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినం లేదా ఓజోన్ దినంగా ప్రకటించింది. సెప్టెంబర్ 16, 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్‌పై ప్రపంచ దేశాలు సంతకం చేశాయి. దీని ఆధారంగా ఓజోన్ దినాన్ని సెప్టెంబర్ 16న నిర్వహిస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఓజోన్ పొర కరిగిపోవడానికి కారణాలైన క్లోరోఫ్లోరో కార్బన్ వంటి హానికారకాలైన రసాయనాలను తగ్గించాలి.
  • అక్టోబర్ 2: మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 2ను అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటిస్తారు. 2007 నుంచి ప్రతి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.
  • అక్టోబర్ 16: అక్టోబర్ 16, 1945లో ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) ఏర్పాటైంది. అందువల్ల అక్టోబర్ 16ను ప్రపంచ ఆహార దినంగా పాటిస్తారు. ఆహార ఉత్పత్తిని పెంచడం, ఆకలి, పేదరికం, పోషకాహారలోపం వంటి అంశాల గురించి ప్రజలను చైతన్యపరచడం వంటివి ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశాలు.
  • డిసెంబర్ 10: డిసెంబర్ 10, 1948లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ మానవహక్కుల విశ్వవ్యాప్త ప్రకటనను ఆమోదించింది. ఆ కారణంగా డిసెంబర్ 10వ తేదీని ప్రపంచ మానవహక్కుల దినంగా నిర్వహిస్తారు.
వివిధ పోటీ పరీక్షలలో అడిగిన కొన్ని ప్రశ్నలు
  1. ప్రపంచ పర్యావరణ దినం?
  2. ప్రపంచ ఆరోగ్య దినం?
  3. ప్రపంచ వారసత్వ దినం?
  4. ప్రపంచ పుస్తక దినం?
  5. పత్రికా స్వాతంత్య్ర దినం?
  6. మే 21ను ఏ రోజుగా నిర్వహిస్తారు?
  7. జాతీయ విద్యాదినం?
  8. జాతీయ సైన్‌‌స దినం?
  9. ప్రపంచ మానవ హక్కుల దినం?
  10. ప్రపంచ తపాలా దినం?
  11. అంతర్జాతీయ కుటుంబ దినం?
  12. ప్రపంచ జనాభా దినం?
సమాధానాలు: 1. జూన్ 5, 2. ఏప్రిల్ 7, 3. ఏప్రిల్ 18, 4.ఏప్రిల్ 23, 5. మే 3, 6. తీవ్రవాద వ్యతిరేక దినం, 7. నవంబర్ 11, 8. ఫిబ్రవరి 28, 9. డిసెంబర్ 10, 10. అక్టోబర్ 9, 11. మే 15, 12. జూలై 11.

మరికొన్ని అంతర్జాతీయ దినోత్సవాలు
జనవరి 30 ప్రపంచ కుష్టువ్యాధి నిర్మూలనా దినం
ఫిబ్రవరి 2 వరల్డ్ వెట్‌ల్యాండ్‌‌స డే
ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
మార్చి 15 ప్రపంచ వినియోగదారుల హక్కుల దినం
మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినం (స్పారో డే)
మార్చి 21 ప్రపంచ అటవీ దినం
మార్చి 21 అంతర్జాతీయ వర్ణ వివక్ష నిర్మూలనా దినం
మార్చి 22 ప్రపంచ నీటి దినం
మార్చి 23 ప్రపంచ వాతావరణ దినం
మార్చి 24 ప్రపంచ క్షయ దినం
మార్చి 27 థియేటర్ దినం
ఏప్రిల్ 17 ప్రపంచ హీమోఫీలియా దినం
ఏప్రిల్ 18 ప్రపంచ వారసత్వ దినం
ఏప్రిల్ 22 ధరిత్రీ దినం
ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక, కాపీరైట్ దినం
ఏప్రిల్ 30 అంతర్జాతీయ జాజ్ దినం
మే 1 అంతర్జాతీయ కార్మిక దినం
మే 3 పత్రికా స్వాతంత్య్ర దినం
మే 8 ప్రపంచ రెడ్‌క్రాస్ దినం
మే 12 అంతర్జాతీయ నర్సుల దినం
మే 15 అంతర్జాతీయ కుటుంబ దినం
మే 17 ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినం
మే 22 జీవ వైవిధ్య దినం
జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినం
జూన్ 26 మాదకద్రవ్యాల వాడకం, అక్రమ రవాణా వ్యతిరేక దినం
జూలై 12 మలాలా దినం
జూలై 18 నెల్సన్ మండేలా దినం
ఆగస్టు 6 హిరోషిమా దినం
ఆగస్టు 9 నాగసాకి దినం
సెప్టెంబర్ 21 అంతర్జాతీయ శాంతి దినం
సెప్టెంబర్ 27 ప్రపంచ పర్యాటక దినం
అక్టోబర్ 1 అంతర్జాతీయ వృద్ధుల దినం
అక్టోబర్ 9 ప్రపంచ తపాలా దినం
అక్టోబర్ 11 అంతర్జాతీయ బాలికా శిశు దినం
అక్టోబర్ 24 ఐక్యరాజ్యసమితి దినం
అక్టోబర్ 31 ప్రపంచ పొదుపు దినం
నవంబర్ 14 డయాబెటీస్ దినం
డిసెంబర్ 1 ఎయిడ్స్ దినం
డిసెంబర్ 3 అంతర్జాతీయ వికలాంగుల దినం

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu