చర్లపల్లి జైలులో భానుకిరణ్ నుంచి 'బాటిల్స్' స్వాధీనం
హైదరాబాద్ : చర్లపల్లి సెంట్రల్ జైలులో పోలీసు ఉన్నతాధికారులు శనివారం ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మానస్ బ్యారక్ లో 10 మందు బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అయితే ఈ బాటిళ్లు మద్దెల చెరువు సూరి హత్యకేసులో నిందితుడు భానుకిరణ్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.
భాను కిరణ్ వద్ద నుంచి సదరు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించారు. భాను కిరణ్ కి మద్యం బాటిళ్లు ఎవరు అందజేశారు అనే అంశంపై ఉన్నతాధికారులు జైలు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. కాగా జైలులో మందు బాటిళ్లు దొరకడంపై జైళ్లశాఖ ఉన్నతాధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.click here to see
Post a Comment