అతనో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాడు.ఏడాదికి 18 లక్షల రూపాయల జీతం. కానీ సివిల్స్ లో ర్యాంక్ కొట్టి ఐఏఎస్ అధికారి కావాలనేది అతని కల. అయితే అతని కల నెరవేర లేదు. సివిల్స్ లో ర్యాంక్ రాలేదు. అంతే సైకోగా మారి పోయాడు. తల్వార్ తో స్వైర విహారం చేశాడు. తల్లి తండ్రులతో సహా అనేక మంది పై దాడి చేసి గాయ పర్చాడు. చివరకు పోలీసు కాల్పుల్లో బలయ్యాడు.
అతని పేరు బల్వీందర్ సింగ్. కరీంనగర్ పట్టణంలోని లక్ష్మీనగర్ లో అతని కుటుంభం ఉంటుంది. బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్న అతను రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. మంగళవారం తెల్లవారుజామునే తండ్రి అమృత్ సింగ్, తల్లి బేబీ కౌర్ లను కత్తితో పొడిచాడు. వారిని తీవ్రంగా దూషిస్తూ తల్వార్ తో బయటికి వచ్చాడు. స్వామియే శరణం అయ్యప్ప అని అరుస్తూ.... బయట నిలిపి ఉన్న మినీ వ్యాన్ అద్దాలు పగులగొట్టాడు. అటుగా వెళ్తున్న శ్రీమన్నారాయణ అనే ఆటో డ్రైవర్‌ను గాయపరిచాడు.
సమాచారం అందుకొని అక్కడికి చేరుకున్న పోలీసులపైనా దాడికి యత్నించాడు. దీంతో పోలీసులు అతని పై కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో కుప్పకూలిపోయిన బల్వీందర్‌ను పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు.
టెంత్ లో, ఇంటర్ లో, ఎమ్సెట్ లో స్టేట్ ర్యాంక్ లు సాధించిన బల్వీందర్ సింగ్ కన్న కలలే అతన్ని బలి తీసుకున్నాయా ? లేదా జ్ఝానం కోసం కాకుండా ర్యాంకుల కోసమే అన్నట్టు తయారై, విద్యార్థుల మీద గెలుపు అనే వత్తిడి పెంచుతున్న మన విద్యా వ్యవస్థదే అతని మరణానికి కారణమా ? ఇవన్నీ కావచ్చు. అంతే కాకుండా చట్టం చెప్పినట్టు ఇటువంటి వారిని నిలవరించడంకోసం కాళ్ళ మీద కాల్చాలన్న కనీస ట్రైనింగ్ లేని పోలీసుల పాత్ర కూడా అతని మరణంలో లేదనగలమా ?
Post a Comment