-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

January 13, 2016

వాట్సప్ లో గ్యాంగ్ రేప్ వీడియో, మహిళ ఆత్మహత్య.!!!


ముజఫర్ నగర్: ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహిత(40)పై నలుగురు దుండగులు గ్యాంగ్ రేప్ కు పాల్పడి ఆ దృష్యాలను వాట్సప్ లో షేర్ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ మహిళ విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ముజఫర్ నగర్ జిల్లాలోని చాప్రా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ముజఫర్ నగర్ ఎస్పీ ప్రదీప్ గుప్తా మాట్లాడుతూ.. 'చాప్రా గ్రామానికి చెందిన ఓ మహిళపై ఆదివారం నలుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను వీడియో తీసి వాట్సప్ లో షేర్ చేశారు. మంగళవారం ఈ విషయం తెలుసుకున్న సదరు మహిళ విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది' అని తెలిపారు. నిందితులపై  కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపిన ఆయన దుండగులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu