భెల్ సీఎండీగా అతుల్ సోబ్టి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అతిపెద్ద విద్యుత్ యంత్రాల తయారీ సంస్థ భెల్ సీఎండీగా అతుల్ సోబ్టి శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. గతేడాది సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం భెల్ సీఎండీ (చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్)గా అతుల్ సోబ్టి నియామకానికి పచ్చజెండా ఊపింది. ఈయన ఐదేళ్లపాటు తన సేవలను భెల్‌కు అందించనున్నారు. ఈ నియామకానికి ముందు అతుల్ సోబ్టి.. భెల్ బోర్డులో డెరైక్టర్‌గా ఉన్నారు.
Post a Comment