-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

January 20, 2016

రష్యా ఎంబసీ లక్ష్యంగా ఆత్మాహుతి దాడి!

కాబూల్: కాబుల్ లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ప్రభుత్వ రవాణా బస్సును టార్గెట్ చేసుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పదిమందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం. చాలామంది గాయపడినట్లు కూడా తెలుస్తోంది. రష్యా దౌత్య కార్యాలయానికి అత్యంత సమీపంలో ఈ దాడి జరిగింది.

దీంతో రష్యా దౌత్య కార్యాలయాన్నే టార్గెట్ చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారా అని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇటీవల ఉగ్రవాదులు వరుసగా, ఇండియా, పాకిస్థాన్ దౌత్య కార్యాలయాలపై దాడులకు దిగిన విషయం తెలిసిందే. తాజా రష్యా దౌత్య కార్యాలయాన్ని టార్గెట్ చేసుకొని దాడికి దిగినట్లయితే మున్ముందు మరిన్ని దేశాల దౌత్య కార్యాలయాలపై కూడా దాడులు జరిగే అవకాశం లేకపోలేదు.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu