బాబాయ్, మామయ్యలకు డొనేషన్ ఇచ్చాడట..?
ఎన్నడూ లేనంతగా సంక్రాంతి సినిమాలు ఈ సారి చర్చకు వస్తున్నాయి. బరిలో నాలుగు సినిమాలు ఉన్నా ముఖ్యంగా చర్చించుకుంటుంది మాత్రం బాబాయ్, అబ్బాయ్‑ల గురించే. చాలా రోజులుగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్న ఎన్టీఆర్, బాలకృష్ణలు ఈ సారి ప్రత్యక్ష యుద్దానికి దిగుతున్నారు. సంక్రాంతి బరిలో బాబాయ్ డిక్టేటర్‑గా వస్తుంటే, అబ్బాయి నాన్నకు ప్రేమతో సినిమాతో సవాల్ చేస్తున్నాడు. ఇలా ఫేస్ టు ఫేస్ వార్ జరుగుతున్న సందర్భంలో జూనియర్ తీసుకున్న ఓ నిర్ణయం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. సంక్రాంతి స్పెషల్ గా ఎన్టీఆర్ పాల్గొన్న మీలో ఎవరు కోటీశ్వరుడు ఎపిసోడ్ ప్రసారం అవుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో నందమూరి కుటుంబం రెండుగా చీలిపోయిందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఎన్టీఆర్‑ను ఒంటరిని చేసే ప్రయత్నం జరుగుతుందంటున్నారు జూనియర్ అభిమానులు. ఈ పరిస్థితుల్లో ప్రముఖ టివి షో మీలో ఎవరు కోటీశ్వరుడులో పాల్గొన్న ఎన్టీఆర్ నందమూరి అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో తాను గెలుచుకున్న మొత్తాన్ని బాబాయ్ బాలయ్య ఆధ్వర్యంలో నడుస్తున్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‑కు సగం, మామయ్య చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్‑కు సగం ఇవ్వనున్నట్టుగా ప్రకటించారు. దీంతో బాబాయ్ అబ్బాయిల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న విషయం పై కన్ఫ్యూజ్ అవుతున్నారు ఫ్యాన్స్.

Post a Comment