హైదరాబాద్: భాగ్యనగరంలో ఎక్కడ చూసినా సంక్రాంతి సంబరాలు కనిపిస్తున్నాయి. నగరంలో ప్రతి ఏరియాలో భోగి సంబరాలు జరుపుకుంటున్నారు. నగర ప్రజలు భోగి పండుగను భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకున్నారు. కేబీఆర్ పార్క్ లో జరిగిన భోగి మంటల వేడుకలో ఎంపీ కవిత పాల్గొన్నారు.
గతాన్ని భోగి మంటల్లో కాల్చేద్దాం.. కొత్త ఆశలు, ఆశయాలను ఆహ్వానిద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కూకట్ పల్లి మలేసియ టౌన్ షిప్, ఇతర ప్రాంతాలలో కూడా భోగి మంటలు ఏర్పాటుచేసి నగర ప్రజలు వేడుకగా సంక్రాంతి పండుగకు ఆహ్వానం పలికారు.
Post a Comment