-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

January 11, 2016

'పోలీసులూ.. ఆ ఫొటో బాలేదు, ఈ సెల్ఫీ పెట్టండి'...!!


వాషింగ్టన్: ఓ నిందితుడు సోషల్ మీడియాలో పోలీసుల వాంటెడ్ జాబితాలో తన ఫోటో ను చూసి అవాక్కయ్యాడు. ఆ ఫోటో భయంకరంగా ఉందని, దాని బదులు మరో ఫొటో ఉంచండి.. అంటూ సెల్ఫీ తీసి పోలీసులకు పంపాడు. పోలీసులు నిందితుడి పాత ఫొటోతో పాటు అతను పంపిన సెల్ఫీని కూడా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. అమెరికాలోని లిమా పోలీస్ డిపార్ట్ మెంట్ కు డొనాల్డ్ ఏ చిప్ పుగ్ (45) అనే నిందితుడు సెల్ఫీ పంపగా, పోలీసులు అతనికి ధన్యవాదాలు తెలిపారు.

పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న డొనాల్డ్ కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని, అతని అచూకీ తెలిస్తే తెలిపాలని లిమా పోలీసులు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఫేస్ బుక్ లో ఉన్న డొనాల్డ్ కొత్త ఫొటోను అతనే సెల్పీ తీసి పంపాడిని వెల్లడించారు. తమకు సాయపడినందుకు డొనాల్డ్ కు ధన్యవాదాలు తెలుపుతూ, అతను తమ దగ్గరకు వచ్చి, నేరాల గురించి చెబితే అభినందిస్తామని కామెంట్ పోస్ట్ చేశారు.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu