స్వీట్ షాక్...
న్యూ ఇయర్‌ను ఎంజాయ్ చేయడానికి మాల్దీవుల కన్నా బెస్ట్ ప్లేస్ ఉండదేమో అంటున్నారు నటి సోనమ్ కపూర్. కొంతమంది స్నేహితులతో, చెల్లెలు రియా కపూర్‌తో కలిసి నాలుగు రోజుల క్రితమే ఆమె అక్కడికి చెక్కేశారు. అక్కడి బీచ్‌లో స్నేహితులతో సందడి చేస్తున్న సోనమ్‌కి అర్జున్ కపూర్ స్వీట్ షాకిచ్చాడు. అర్జున్ తండ్రి బోనీకపూర్, సోనమ్ తండ్రి అనిల్ కపూర్ అన్నదమ్ములనే విషయం తెలిసిందే. చెల్లెలిని సర్‌ప్రైజ్ చేయాలనుకున్న అర్జున్ ముందుగా చెప్ప కుండా మాల్దీవుల్లో వాలిపోయాడు. ఆ తర్వాత అన్నాచెల్లెలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
Post a Comment