చెన్నై: బొమ్మరిల్లు చిత్రంతో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న నటుడు సిద్ధార్థ్ కథానాయకుడుగా నటించిన 'జిల్ జంగ్ జక్' తమిళ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన కొన్ని ట్వీట్లు చేశారు. ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని అందులో పేర్కొన్నారు. ఇటీవల చెన్నైలో భారీ వర్షాలు కురిసి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సిద్ధార్థ్ వరద బాధితుల కోసం చాలా కృషి చేశారని రాజమౌళి ట్విట్లతో కొనియాడారు. సిద్ధార్థ్‌కు హాట్సాఫ్ చెబుతూ అభినందించారు.
Post a Comment