ఇప్పుడు తెలుగులో క్రేజీయెస్ట్ హీరోయిన్ ఎవరు? నో డౌట్. రకుల్ ప్రీత్‌సింగే. తన గ్లామర్‌తో యూత్ హార్ట్స్‌లో ప్లేస్ సంపాదించిన రకుల్ ఇప్పుడు చేసేవన్నీ టాప్‌స్టార్స్ సినిమాలే. ‘నాన్నకు ప్రేమతో...’లో సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్న ఈ బ్యూటీకి ‘బ్రహ్మోత్సవం’లో మహేశ్‌బాబు సరసన నటించే అవకాశం లభించనుందట.
ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు. సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత. నిజానికి, సమంత ఇప్పటివరకూ ఈ షూటింగ్‌లోకి ఎంటర్ కాలేదు. తమిళంలో ఆమె చాలా బిజీగా ఉండటంతో, ‘బ్రహ్మోత్సవం’కు ఆమె ఎంతవరకు డేట్స్ కేటాయిస్తారనే అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో రకుల్ ప్రీత్‌సింగ్‌ను తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టుగా ఫిలిమ్ నగర్‌లో వినికిడి.
Post a Comment