-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

January 05, 2016

అగ్నికీలల్లో బస్సు.. 14మంది సజీవ దహనం

బీజింగ్: చైనాలో ఓ బస్సు అగ్ని కీలల్లో చిక్కుకుంది. ఫలితంగా 14మంది సజీవదహనం కాగా 30మందికి పైగా గాయాలపాలయ్యారు. పోలీసు అధికారులు తెలిపిన ప్రకారం మంగళవారం వేకువ జామున ఈ ఘటన చోటుచేసుకుంది.

చైనాలోని యించువాన్ ప్రాంతంలో అనూహ్యంగా బస్సులో మంటలు వ్యాపించాయని, అవి శరవేగంగా వ్యాపించి బస్సును చుట్టుముట్టి అందులోని ప్రయాణీకులు సజీవ దహనం చేశాయని చైనా అధికారులు తెలిపారు. అయితే, ఈ ప్రమాదం జరగడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. ఇటీవల చైనాలో బస్సులు అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఈ ప్రమాదాల వెనుక కొంతమంది కుట్రలు కూడా ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu