కాబూల్: తాలిబన్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వారిని అఫ్గనిస్థాన్ సేనలు తరిమి తరిమికొట్టి పైచేయి సాధించాయి. తాము ఆక్రమించుకున్న జిల్లాను అఫ్గానిస్తాన్ సేనలు తిరిగి స్వాధీన పరుచుకున్నాయి. ఈ క్రమంలో 30మంది ఉగ్రవాదులను హతమార్చి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో ఆయుధ సామాగ్రిని స్వాధీన పరుచుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. 2014 నుంచి అప్గానిస్తాన్ లోని తాలిబన్ ఉగ్రవాదులు తజకిస్థాన్ సరిహద్దులోని దార్కాద్ అనే జిల్లాను కొద్దికొద్దిగా ఆక్రమించుకున్నాయి. దీనిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వ బలగాలు స్ధానిక పోలీసులు ఎంతో శ్రమించారు. ఈ క్రమంలో ఎంతోమంది ప్రాణాలుకోల్పోయారు. క్షతగాత్రులుగా మిగిలారు. చివరికి పైచేయి సాధించారు. ఈ సందర్భంగా అఫ్గాన్ ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేస్తూ 'ఇక పూర్తి స్థాయిలో ఉగ్రవాదులను ఊడ్చిపారేసే చివరి కార్యక్రమం జరుగుతోంది. ప్రస్తుతం పరిస్థితి మా నియంత్రణలో ఉంది. ఇది అఫ్గానిస్తాన్ సైన్యానికి మంచి ప్రశాంతతను ఇచ్చే అంశం' అని పేర్కొంది. ప్రస్తుతం కుందుజ్ ప్రాంతం కూడా ఉగ్రవాదుల చెరలో ఉంది. దానిని విముక్తి చేసేందుకు అమెరికా, అఫ్గాన్ సేనలు తీవ్రంగా కృషిచేస్తున్నాయి.

Post a Comment