-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

January 10, 2016

దేవుని మాట... బండలపై పునాది

దేవుని మాట... బండలపై పునాది
• సువార్త
మనుషులు బుద్ధిగలవారా, బుద్ధిలేనివారా అన్నది వారి వారి క్రియల ద్వారా వెల్లడి అవుతుంది. ఒకనాడు యేసు ప్రభువు బుద్ధిగలవారు ఎలాంటివారు, బుద్ధిలేనివారు ఎలాంటివారు అన్నదానికి ఒక సూక్ష్మమైన కథ చెప్పారు. ఒక ఊళ్ళో బుద్ధిగలవాడు ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంటి పునాదిని బండపై వేశాడు. ఆ ఊళ్ళోనే ఉన్న ఒక బుద్ధిలేనివాడు తన ఇంటిని ఇసుకపై కట్టాడు. ఒక రోజు అకస్మాత్తుగా వానకురిసి వరద వచ్చింది, విసిరికొట్టే గాలి వచ్చింది.
  బుద్ధిమంతుడు బండపై పునాదివేసి తన ఇంటిని కట్టుకున్నాడు గనుక ఆ ఇల్లు కూలలేదు. కానీ ఇసుకపై కట్టుకున్న బుద్ధిలేనివాని ఇల్లు కుప్పకూలిపోయింది. (మత్త 7:24-27) ఈ ఘటన ఉదహరిస్తూ ‘ఎవరైతే నా మాట విని వాటి చొప్పున చేయకుందురో వారు ఇసుకపై ఇల్లు కట్టుకొన్న బుద్ధిహీనుని పోలినవారు. అట్టివారు జీవితంలో గాలి, వాన, వరద వంటి ఏదైనా కష్టం, సమస్య, శ్రమ వచ్చినప్పుడు వారి జీవితం కూలిపోతుంది. బండపై కట్టిన బుద్ధిమంతుని ఇంటికి కూడా అలాగే గాలి, వాన, వరద వంటివి ఎదురైనాయి. కాని అ ఇంటి పునాది బండపై వేయబడినది. అనగా దేవుని మాట విని దాని ప్రకారం చేసిననాడు. గనుక వాని జీవితం స్థిరంగా నిలిచింది. జీవితంలో సమస్యలు, కష్టాలు అందరికి అనివార్యమే. కాని దేవుని మాట ప్రకారం నడుచుకున్న వారి జీవితం సదా క్షేమప్రదం.
 జీవితం మనం కట్టుకునే ఇంటితో సమానం. ఒక బాధ్యతతో బుద్ధి కలిగి, దూరపు చూపుతో, ఓపికతో, క్రమశిక్షణతో జీవితాన్ని కట్టుకోవాలి. బుద్ధిహీనత స్వభావం తొందరపాటు, దూరదృష్టి లేకపోవటం తాత్కాలిక ప్రయోజనాలే లక్ష్యంగా ఉండటం. అలాంటి బుద్ధిలేని వారి జీవితంలో ఎదురయ్యే జీవిత సమస్యలు జీవితాన్ని కుప్పకూల్చేస్తాయి. బుద్ధిగల వానికి సాదృశ్యం అతడు కేవలం వినువాడు కాదు. దాని ప్రకారం నడుచుకొనువాడు.
   
బుద్ధిలేని వాడు వినును కాని దాని ప్రకారం నడుచుకొనడు. మనం ఎన్ని హితోపదేశములనైనా వింటుండవచ్చు కాని ఆచరణ లేనప్పుడు ఎట్టి విలువైన సందేశములైనా వ్యర్థమే. అచరణకు - ఆలకించుటకు మధ్య చాలా తతంగమే ఉంటుంది. బుద్ధిమంతుడు తన క్రియలలో సార్థకమవుతాడు. నిజానికి ఈ జీవితంలో మన కెదురయ్యే పరీక్షలే మనము బుద్ధిగలవారమా లేక బుద్ధిలేనివారమా అన్నది నిర్ణయిస్తుంది. అట్టివి మన బుద్ధి నాణ్యతను తేల్చును. బుద్ధిగల వాని ఇల్లు, బుద్ధిలేని వాని ఇల్లు యొక్క భవిష్యత్తు తేల్చినది ఆ ఇంటికి కలిగిన విపత్తు.

 ఈ జీవితంలో మనలను నిలబెట్టునది దేవుని మాటయే. అయన మాట మనలో బుద్ధిని కలుగజేయును. దేవుని మాటపై కట్టుకున్న జీవితం పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. బైబిల్ చెబుతుంది. ‘‘ప్రపంచములు దేవుని మాటపై నిర్ణయించబడ్డాయి.’’ దేవుని మాట అలక్ష్యం చేసి అశ్రద్ధ్దగా కట్టుకొన్న జీవితం పతనం అవుతుంది. బుద్ధిగలవాడు ఉపదేశం వలన తెలివి నొందును. బుద్ధిహీనునికి దెబ్బలు నాటునంతకంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును.

  బుద్ధిలేని వానికి మూఢత సంతోషము. బుద్ధి నిన్ను కాపాడును. బుద్ధిహీనునికి క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు అని బైబిలు చెబుతుంది. ఇవే బుద్ధిగలవారికిని, బుద్ధిలేనివారికిని మధ్య ఉన్న అంతరం. గకక బుద్ధికలిగి నడుచుకొందము.
                                                - రెవ.పి.ఐజక్ వరప్రసాద్

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu