కోల్ కతా: పశ్చిమబెంగాల్ లోని దక్షిణ దీనజ్ పూర్ జిల్లాలో ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. డబ్బుల కోసం స్నేహితురాలి మైనర్ కూతురు (14) ను.. నలుగురు వ్యక్తులకు అప్పగించి సామూహిక అత్యాచారం చేయించింది. పోలీసులు కేసు నమోదు చేసి సదరు మహిళ సహా ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
నిందితురాలు స్నేహితురాలి కూతురును బలుర్గాట్ పట్టణంలో ఓ ఇంటికి తీసుకెళ్లి నలుగురు దుండగులకు అప్పగించింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. నిందితులు ఆ అమ్మాయిపై లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలు ఇంటికి తిరిగొచ్చి జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Post a Comment