*బయటపడిన డ్రగ్ మాఫియా అధినేత గుజ్ మాన్-నటి ఛాటింగ్ ముచ్చట్లు
మెక్సికో: జోక్విన్ ఎల్ చాపో గుజ్ మాన్... ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా అధినేత. మెక్సికన్ డ్రగ్ మాఫియా చీకటి సామ్రాజ్యాన్ని తన కనుసన్నలతోనే శాసించగల ఈ కరుడుగట్టిన నేరగాడు ప్రముఖ మెక్సికన్ నటి కేట్ డెల్ కాస్టిలోను 'నువ్వు ప్రతి సందర్భంలోనూ ఎంతో అందంగా ఉంటావు' అని ప్రశంసించగా ఆమె మాత్రం 'నిన్ను కలవడం నా కల' అంటూ ఇద్దరు పరస్పరం ఒకరినొకరు పలకరించుకున్నారు. వీరిద్దరు ఈ విధంగా జరిపిన సంభాషణ చాటింగ్ లను మిలీనియో అనే వార్తపత్రిక బుధవారం బయటపెట్టింది.
గతేడాది అక్టోబర్ లో మెక్సికన్ అడవుల్లో వీరిద్దరితో పాటు మరో అమెరికన్ నటి సియాన్ పెన్ తో సమావేశమైన ముందు, అనంతరం జరిపిన చాటింగ్ లు నేడు ప్రపంచం ముంగిట బహిర్గతమయ్యాయి. ఈ సందేశాలు బయటకి పొక్కడంతో వీరిద్దరి మధ్య ఉన్న సంబంధాలు కొత్త ఊహాగానాలకు తెర తీసాయి. గత జూలైలో అసాధారణంగా మెక్సికన్ జైలు నుంచి సొరంగం తవ్వి పారిపోయిన గుజ్ మాన్ కు సంబంధించి మళ్లీ వార్తలు రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
Post a Comment