కొలంబో: శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) కు జరిగిన ఎన్నికల్లో మాజీ కెప్టెన్ అర్జున రణతుంగకు పరాభవం ఎదురైంది. శ్రీలంక క్రికెట్ బోర్డు ఉపాధ్యక్షుడిగా పోటీపడ్డ రణతుంగ 22 ఓట్ల తేడాతో ఓటమి చెందాడు. రణతుంగపై జయంత ధర్మదాస విజయం సాధించాడు. ఇదిలా ఉండగా మరో జాతీయ స్థాయి క్రికెటర్, రణతుంగ తమ్ముడు నిషాంత్ రణతుంగ అధ్యక్ష స్థానానికి పోటీపడి పరాజయం చవిచూశాడు. కేవలం 56 ఓట్లు మాత్రమే సాధించిన నిషాంత్ ఓటమి చెందగా, అతనిపై పోటీ చేసిన తిలంగా సుమతిపాలా 88 ఓట్లతో ఘన విజయం సాధించి మూడో సారి బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈ మేరకు ఆదివారం శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నడుమ ఎన్నికలను నిర్వహించారు.
గతంలో బోర్డు సెక్రటరీగా గెలిచిన నిషాంత్ ఆ తరువాత కొన్నాళ్లకు తన పదవిని కోల్పోయాడు. శ్రీలంక క్రికెట్ బోర్డులో చోటు చేసుకున్న వివాదాల కారణంగా గతేడాది మార్చిలోతాత్కాలిక కమిటీ అనివార్యమైంది. దీంతో నిషాంత్ తన పదవిని కోల్పోయాడు.1996 లో జరిగిన వరల్డ్ కప్ లో అర్జున రణతుంగ సారథ్యంలోని శ్రీలంక విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
Post a Comment