చిత్తుగా ఓడిన దక్షిణాఫ్రికా
రెండో ఇన్నింగ్స్‌లో 83 ఆలౌట్
సిరీస్ ఇంగ్లండ్ సొంతం
టెస్టుల్లో నంబర్‌వన్‌గా భారత్
జొహన్నెస్‌బర్గ్: ఇంగ్లండ్ పేస్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ (6/17) నిప్పులు చెరిగే బౌలింగ్‌తో దక్షిణాఫ్రికాను కుప్పకూల్చాడు. ఫలితంగా మూడో రోజే ముగిసిన మూడో టెస్టులో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించింది. శనివారం లంచ్‌కు ముందు తమ తొలి ఇన్నింగ్స్‌లో 323 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లండ్‌కు 10 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. జో రూట్ (110) సెంచరీతో కీలక పాత్ర పోషించాడు. ఈ సమయంలో మ్యాచ్ సమంగానే ఉంది. అయితే రెండో సెషన్‌లో బ్రాడ్ అనూహ్యంగా చెలరేగిపోవడంతో సఫారీలు చేతులెత్తేశారు. టాప్-6 బ్యాట్స్‌మెన్ ఎల్గర్ (15), వాన్‌జిల్ (11), ఆమ్లా (5), డివిలియర్స్ (0), డు ప్లెసిస్ (14), బవుమా (0) బ్రాడ్ బౌలింగ్‌కే బలి కావడం విశేషం. అనంతరం 74 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 22.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0తో గెలుచుకుంది. సిరీస్‌లో చివరిదైన నాలుగో టెస్టు శుక్రవారం నుంచి సెంచూరియన్‌లో జరుగుతుంది.
తాజా ఫలితంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా నంబర్‌వన్ స్థానం కోల్పోయింది. విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ కానుంది. నాలుగో టెస్టులో ఒక వేళ దక్షిణాఫ్రికా గెలిచినా... భారత్ స్థానానికి మాత్రం ఢోకా ఉండదు.
Post a Comment