-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

January 18, 2016

12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన క్రిస్ గేల్...


డాక్ లాండ్స్:  వెస్ట్ ఇండిస్ విధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు.

ఆడిలైడ్ స్ట్రైకర్స్ తో మెల్ బోర్న్ రెనిగేడ్స్ తో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ టీ20 మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఆడిలైడ్ టీం 170 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మెల్బోర్న్ టీం ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్ క్రిస్ గేల్ తొలి ఓవర్లోనే 4 సిక్సర్లు కొట్టడంతో 27 పరుగులు చేసింది. ఈ క్రమంలో క్రిస్ గేల్ ఏడు సిక్సర్లు, ఒక ఫోర్ తో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 17 బంతులు ఆడిన గేల్ 56 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే గేల్ చెలరేగినా మెల్ బోర్న్ రెనిగేడ్స్ మాత్రం గెలవలేక పోయింది. 15.3 ఓవర్లలోనే 143 పరుగులు చేసి ఆలౌటయింది.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu