-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

January 14, 2016

చైనా టపాసుల ఫ్యాక్టరీలో పేలుళ్లు.. 10 మంది మృతి...!!!


చైనా: చైనాలో ఓ ఫ్యాక్టరీలో పేలుళ్లు చోటుచేసుకొని 10మంది ప్రాణాలుకోల్పోయారు. టపాసుల ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మీడియా వర్గాలు తెలిపిన ప్రకారం చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లోగా ఓ టపాసుల ఫ్యాక్టరీలో అక్కడి కాలమానం ప్రకారం గురువారం ఉదయం 10.48గంటలకు పేలుళ్లు చోటుచేసుకున్నాయి.

దీంతో అక్కడికక్కడే 10మంది ప్రాణాలుకోల్పోగా.. మరో డజనుమందికిపైగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్లగానీ, రసాయనాల మిశ్రమం కలిపే సమయంలోగానీ ఈ ప్రమాదం చోటుచేసుకుని ఉండొచ్చని అధికారులు చెప్తున్నారు. విచారణ ప్రారంభించారు.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu