రచయిత, గాయకుడు, ప్రజా కళాకారుడు, ప్రజా కళామండలి ప్రధాన కార్యదర్శి కోటిని గుంటూరులో పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యేక తెలంగాణ పోరాటంలోనూ ప్రజా సమస్యల మీద జరిగిన అనేక ఆందోళనల్లో కోటి చురుకుగా పాల్గొన్నారు. గుంటూరు లో జరుగుతున్న ప్రజాసంఘాల సమేవేశానికి హాజరైన ఆయనను శనివారం మధ్యాహ్నం మఫ్టీలో వచ్చిన పోలీసులు అరెస్టు చేసారు. సమావేశం తర్వాత హోటల్ లో టీ తాగుతుండగా హటాత్తుగా కోటిని చుట్టుముట్టిన పోలీసులు ఆయనను బలవంతంగా తీసుకెళ్ళారు. కోటిని అరెస్టు చేస్తుండగా అక్కడ ఉన్న ప్రజాసంఘాల సభ్యులు అడ్డుకోవడం తో కొద్ది సేపు తోపులాట జరిగింది. కోటిని ఏ కారణంతో అరెస్టు చేసారో కనీసం చెప్పక పోవడం అన్యాయమని, ఇది అక్రమ అరెస్టు అని ప్రజాసంఘాలు ఆరోపించాయి. మరో వైపు కోటిని తక్షణం విడుదల చేయాలని విప్లవ రచయిత వరవరరావు, పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ ప్రధాన కార్యదర్శి చిలకా చంద్రశేఖర్, తెలంగాణ ప్రధాన కార్యదర్శి నారాయణ రావులు డిమాండ్ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
Post a Comment