అమ్మకు తెలియకుండా పిండం మాయం
► విశాఖ తీరాన బేబీ ఫ్యాక్టరీ
► అంగట్లో ఆట వస్తువులవుతున్న శిశువులు
► అప్పుడే పుట్టిన బిడ్డల్ని సైతం అమ్ముతున్న దారుణం
► అమ్మకు తెలియకుండా పిండాన్ని మాయం చేస్తున్న దారుణమిదీ!
► అపురూపమైన అమ్మతనాన్ని అంగడి సరుకు చేస్తున్న నైచ్యమిదీ!!
► పొత్తిళ్లలోని పసిగుడ్డుకు సైతం వెలకట్టి మరీ అమ్ముతున్న ఘోరమిదీ!
► ఫ్రీజింగ్ బ్యాంకుల్లోని పిండాలతో అమానవీయ వ్యాపారం
► సరోగసీ ద్వారా పిల్లల్ని కనిపించి.. కళ్లు తెరవగానే విక్రయాలు
► ఆడపిల్లకు రూ.2.5 లక్షలు, మగ పిల్లాడికి రూ.4.5 లక్షలు
► ఐవీఎఫ్ చికిత్సకు వచ్చే దంపతులే లక్ష్యంగా దళారుల దందా
► ‘సాక్షి’ స్టింగ్ ఆపరేషన్‌లో వెలుగు చూసిన చేదు నిజాలు
సాక్షి, హైదరాబాద్: ‘‘మా దగ్గర పిల్లలు అమ్మబడును.. ఆడపిల్లయితే రెండున్నర లక్షలు, మగపిల్లాడైతే నాలుగున్నర లక్షలు. ఒకరోజు బేబీ కావాలా? నాలుగు రోజుల పాప కావాలా? నెలరోజుల బాబు కావాలా? జాతకం.. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కూడా మా వద్దే లభిస్తాయి. అమ్మకానికి ముందు అన్ని రకాల హెల్త్ చెకప్‌లు చేయించే ఇస్తాం..’’ ఈ మాటలు చెబుతున్నప్పుడు వారి మాటలో వణుకు ఉండదు.. వారి చూపులో బెరుకు ఉండదు.. వాళ్ల మనసులో భయం ఉండదు. ఎందుకంటే అది ఏడాది నుంచి యథేచ్ఛగా సాగిపోతున్న వ్యాపారం! వచ్చిన తల్లిదండ్రుల వివరాలు తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పసివాళ్ల అమ్మకాల్లో తమ ప్రతిభను చూపించడం మొదలుపెడతారు. మాతృత్వం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూసే తల్లులకు వారి మాటలు అమృతంలా అనిపిస్తాయి. అంతే.. అక్కడ్నుంచి బేరాలు మొదలైపోతాయి. విశాఖపట్నం ఆర్కే బీచ్ ఒడ్డున ఉన్న సంతాన సాఫల్య కేంద్రాలు(ఐవీఎఫ్ సెంటర్లు), వాటి పరిసరాల్లోని అపార్ట్‌మెంట్లలో ప్రతిరోజూ (ఐవీఎఫ్ సెంటర్లు) యథేచ్ఛగా సాగుతున్న అమానవీయ వ్యాపారమిదీ! పిల్లలను అంగడి వస్తువులుగా మార్చేసి అమ్ముతున్న ‘బేబీ ఫ్యాక్టరీ’పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

ఆపరేషన్ సాగిందిలా..
ఈ నెల 27 మధ్యాహ్నం ‘సాక్షి’ ప్రతినిధులు విశాఖపట్నం ఆర్కేబీచ్‌ను ఆనుకొని ఉన్న నోవటెల్ హోటల్ దారిలోని ఓ అపార్ట్‌మెంట్‌కి వెళ్లారు. ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్ కోసం వచ్చినట్లు చెప్పి అపార్టుమెంట్‌లో గది అద్దెకు తీసుకున్నారు. అద్దెకు ఇచ్చినవారితో మాట్లాడుతూ.. ‘ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్ సక్సెస్ కావడం లేదు.. దత్తత(అడాప్షన్)కు వెళ్దామనుకుంటున్నాం. ఆ పని మీదే ఇక్కడికి వచ్చాం’ అని చెప్పారు. ఆ మరుసటి రోజు ఉదయం మాటల్లో.. ఆ ఇంటి యజమానులు పిల్లల్ని అమ్మే ఏజెంట్ల గురించి చెప్పారు. వెంటనే పిలిపించమన్నారు. పిలవగానే నిమిషాల్లో ఇద్దరు ఏజెంట్లు ప్రత్యక్షమయ్యారు. అక్కడ్నుంచి మొదలైంది అసలు కథ.
ఈ రోజే పుట్టిన పాప ఉంది కావాలా?
‘మీకు ఎన్ని రోజుల పాప కావాలి చెప్పండి మేడమ్..’ అని ఏజెంట్ అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు.
‘రోజుల పిల్లలు కూడా ఉంటారా..’ అనే ప్రశ్న పూర్తవ్వకుండానే.. ‘ఈ రోజు ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు పుట్టిన అమ్మాయి ఉంది. తీసుకుంటారా...’ అంటూ ఏజెంట్ సమాధానం.
‘ఎక్కడ ఉందండి’ అంటే.....‘ఇక్కడికే తీసుకొస్తాం’ అన్నారు. మధ్నాహ్నం ఒంటి గంటకు అపార్టుమెంట్ కింద తెల్లకారు ఒకటి ఆగింది. అక్కడ్నుంచి ఫ్లాట్ యజమానికి ఫోన్ వచ్చింది. వారు ‘సాక్షి’ ప్రతినిధులను కిందకు వెళ్లి కారులో ఉన్న బిడ్డను చూసుకురమ్మన్నారు. కారు డోర్ తెరిచి చూస్తే ఒక మహిళా ఏజెంట్. ఒళ్లో ఆరు గంటల కిందటే పుట్టిన పసిగుడ్డు! తానున్నది అమ్మ ఒడిలో కాదు.. అమ్మకం ఒళ్లోనని కళ్లు కూడా సరిగ్గా తెరవలేని ఆ పసికందుకు తెలియదు పాపం.
లేత గులాబీ రేకులా మెరిసిపోతున్న ఆ పాప వంక చూస్తు ఏజెంట్.. ‘చూశారు క దండీ.. బేబీ ఎంత తెల్లగా ఉందో. మీరు ఓకే అంటే వెంటనే హెల్త్ చెకప్ చేయించేస్తాను. ముందు మీరు ఫొటోలు తీసుకుని మీ ఇంట్లో వాళ్లకి పంపండి. వాళ్లకి నచ్చితే ఒక గంటలో వచ్చి బేరం మాట్లాడుకుందాం’ అన్నాడు. పావుగంటలో బేబీషో ముగించుకుని కారు తిప్పేశాడు.
పాప ఓకే అయితే చెప్పండి.. వస్తాను
అదే రోజు మధ్నాహ్నం 3 గంటలకు ఫ్లాట్ యజమానికి ఏజెంట్ నుంచి మళ్లీ ఫోన్ వచ్చింది. వెంటనే బేరం గురించి మాట్లాడుకోండి అంటూ ‘సాక్షి’ ప్రతినిధికి ఫోన్ ఇచ్చారు.
‘నా పేరు సుజాత అండి. మీకు పాప నచ్చిందా’ అంటూ ఒక మహిళ మాట్లాడింది.
‘నచ్చింది..’ అనగానే.. ‘మీరు ఎంత వరకూ పెట్టగలరు?’ అని ప్రశ్న.
‘మీకు ఎంత కావాలి?’ అని అడగ్గా.. ‘రెండు లక్షలు, ఆపైన మా ఖర్చులకు మరో రూ.20 వేలు, బర్త్ సర్టిఫికెట్‌కి ఇంకో రూ.10 వేలు..’ అని చెప్పుకుంటూపోయింది.
‘ఇవన్నీ ఫోన్లో మాట్లాడుకోవడం దేనికండీ.. మీరు దగ్గరకు వస్తే కూర్చుని మాట్లాడుకోవచ్చుగా’ అనగానే ఎందుకో ఆమె ఇష్టపడలేదు. ‘మీకు పాప ఓకే అయితే చెప్పండి వస్తాను’ అంది.
‘మాట్లాడుకోకుండా ఓకే ఎలా చెప్పగలమండీ..’ అంటూ పాప గురించి నాలుగు సందేహాలు వ్యక్తం చేయడంతో బిడ్డను తీసుకొచ్చిన ఏజెంట్‌తో పాటు వచ్చింది సుజాత అనే నర్సు.
వాళ్లంతా సరోగసీ ద్వారా పుట్టినవారు..
‘నా పేరు సుజాత అండి. నేను ఇక్కడే నర్సుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి మీ సందేహాలు ఏంటి?’ అంటూ ఓ సేల్స్‌గర్ల్‌ను తలపించేలా గలగలా మాట్లాడుతోంది ఆమె.
‘పాప ఎవరికి పుట్టిందో తెలుసుకోవచ్చా అంటే ఏం లేదండీ కులం (కాస్ట్) గురించి తెలుసుకోవాలని. నిజానికి మాకు ఏ కాస్ట్ అయినా ఓకే కానీ ఏదో ఆసక్తి కొద్దీ అడుగుతున్నానంతే. అలాగే పాప తల్లిదండ్రులకు ఏమైనా జబ్బులుంటే అవి బేబీకి కూడా వస్తాయి కదా! అలాంటి వివరాలు కనుక్కునే అవకాశం ఏమన్నా ఉందంటారా?’ అని అడిగిన ప్రశ్నలకు ఆ నర్సు చెప్పిన సమాధానంతో దిమ్మదిరిగిపోయింది.
‘మేం అమ్మే ఏ పిల్లల కాస్ట్ మాక్కూడా తెలియదు. ఎందుకంటే వాళ్లేమీ తల్లిదండ్రులకు పుట్టిన వారు కాదు కాబట్టి. సరోగసీ పద్ధతి ద్వారా పుట్టినవారు వీళ్లంతా’’ అంటూ చెప్పుకొచ్చింది.
‘సరోగసీ అంటే తల్లిదండ్రుల ఇష్ట ప్రకారం జరిగే వ్యవహారం కదా’ అని సందేహం వ్యక్తం చేయగానే ఆ పిల్లల పుట్టుక గుట్టు విప్పింది.
ఇలా వందల మందికి పిల్లల్ని అమ్మాను..
పిల్లలను ఎలా తెస్తున్నారో సుజాత పూసగుచ్చినట్టు వివరించింది. ‘మీరు ఇప్పటికే మూడు నాలుగుసార్లు ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్ చేయించుకున్నారని చెప్పారు కదా! ఆ వైద్యం సమయంలో అదనంగా ఓ రెండు మూడు పిండాలను ఫ్రీజర్స్‌లో నిల్వ చేస్తారు కదా! ఒకవేళ మీకు మొదటి పిండంతోనే సక్సెస్ అయిందనుకోండి. మిగతావి ఏం చేస్తారు? మేం వాటిని డాక్టర్ల దగ్గర కొనుక్కుని మా దగ్గరున్న సరోగసీ తల్లుల గర్భంలో పెడతాం. ఎంచక్కా మూడో కంటికి తెలియకుండా బిడ్డ మనచేతిలో ఉంటుంది’ అని ఎంతో ఉత్సాహంగా చె ప్పింది.
‘అంటే ఆ బిడ్డ ఎవరిదో మనకి తెలియడం కుదరదు కదా సుజాత గారూ..’ అని అడగ్గా.. ‘ఎవరి బిడ్డయితే మీకెందుకండీ.. మీకు కావాల్సింది హెల్దీ బేబీ. మా దగ్గర పుట్టేవారంతా నార్మల్‌గా పుట్టేవారితో పోలిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారని నేను గట్టిగా చెప్పగలను. నేను ఇప్పటివరకూ కొన్ని వందలమందికి ఇలా పిల్లల్ని అమ్మాను. ఒక్కటంటే ఒక్క కంప్లయింటు కూడా లేదు’ అంటూ ఆ నర్సు చెప్పింది. పక్కనే కూర్చున్న వెంకట్ అనే ఏజెంట్ మాట కలుపుతూ...‘నేను ఇరవై బేబీలను అమ్మానండి. ఇదిగో చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నారో..’’ అంటూ సెల్‌ఫోన్‌లో పిల్లల ఫొటోలను చూపించాడు.
‘అంతే కాదు మేడమ్ మా క్లయింట్స్ అందరూ మాకు ఇప్పటికీ టచ్‌లో ఉంటారు. ఎందుకంటే వారి ద్వారా కూడా కస్టమర్స్ వస్తుంటారు కదా!’ అంటూ ముగించాడు. ‘ఎందుకు ఒక్క తెలుగు రాష్ట్రాల వారే కాదు. ఒడిశా, మహారాష్ట్ర, మద్రాస్, బెంగళూరు నుంచి కూడా చాలామంది వచ్చి మా దగ్గర పిల్లల్ని కొనుక్కెళ్లారు’ అంటూ ముగించింది సుజాత.
‘మా ఇంట్లో వారికి ఫోన్ చేస్తే అబ్బాయినే అబ్బాయినే తీసుకోమంటున్నారండీ..’ అంటూ ‘సాక్షి’ ప్రతినిధులు అక్కడ్నుంచి బయటపడదామనుకున్నారు. అందుకు మరో ఏజెంట్.. ‘దానిదేముందండీ.. మీకు పదిరోజుల్లో సిద్ధం చేస్తాం’ అన్నాడు.
ఐవీఎఫ్ ఆసుపత్రుల అండతో...
విశాఖపట్నంలో ఉన్న ఐవిఎఫ్ ఆసుపత్రుల చుట్టుపక్కల ఇలాంటి ఏజెంట్లు పదుల సంఖ్యలో ఉన్నారు. ఇందులో ఒకరిద్దరు పిల్లల కోసం తండాలను, పేదతల్లిదండ్రులను నమ్ముకుంటే మిగతావారంతా ఎవరికి వారు పిండాలను కొనుక్కుని రహస్యంగా సరోగసి తల్లుల సత్రాలను నెలకొల్పుకుంటున్నారు. ఈ మొత్తం రాకెట్‌లో నర్సులదీ, డాక్టర్ల పాత్రే కీలకం. పిండాన్ని అమ్మడం దగ్గర నుంచి సరోగసి మదర్‌కి డెలివరీ చేసేవరకూ అన్నీ వారే కదా చూసుకోవాల్సింది. ఇక ఏజెంట్ల గురించి చెప్పాలంటే ఆసుపత్రికి ఇద్దరు ముగ్గురు చొప్పున ఉన్నారు. ఇక్కడ మరో ఏజెంట్ మాట్లాడుతూ ‘‘నాకు ఓ ఇరవై ఐవిఎఫ్ ఆసుపత్రుల్లోని డాక్టర్లతో పరిచయాలున్నాయండి. వారికి కావాల్సిన ఎగ్స్, ఎంబ్రియోస్, సరోగసీ మదర్స్...అన్నింటినీ నేనే సరఫరా చేస్తానని చెప్పాడు.
పిండాలను నిల్వ చేస్తారిలా..
ఒక వ్యక్తి నుంచి సేకరించిన వీర్యాన్ని మహిళ అండకణాలు ఫలదీకరణం చెందిచేందుకు మూడుసార్లు ఉపయోగించుకోవచ్చు. అంటే ఒక్కసారి నమూలు సేకరిస్తే మూడు పిండాలకు ఉపయోగపడే అవకాశముంది. వీటిని క్రయో ప్రిజర్వేషన్ పద్ధతిలో అయితే నెల నుంచి 2 నెలల వరకూ నిల్వ చేయవచ్చు. అదే ఫ్రోజన్ సీమెన్ పద్ధతిలో అయితే 6 నెలల వరకూ నిల్వ ఉంచుకునే అవకాశం ఉంటుంది. అయితే వీర్యం ఇచ్చిన దాతతోపాటు అండకణాలు ఇచ్చిన మహిళ నుంచి అనుమతి తీసుకున్న (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) తర్వాతే ఫలదీకరణ చేయాలి. ఎన్ని శాంపిళ్లు, ఎందరికి ఇచ్చినా వారి అనుమతి తప్పనిసరి. ఒక శాంపిల్ ద్వారా ఒక పిండాన్ని అభివృద్ధి చేసి.. మిగతా పిండాలకు అనుమతి అక్కర్లేదనుకుంటే పొరపాటు. చట్టప్రకారం ఎవరికి ఎన్ని శాంపిళ్లు, ఎవరి పిండంలో అభివృద్ధి చేసినా దాతల నుంచి అనుమతి లేకుండా చేస్తే అది చట్టరీత్యా నేరం.

Post a Comment