ఆ ముగ్గురి కలయికలో హార్రర్ చిత్రం
సెల్వరాఘవన్ దర్శకత్వంలో శింబు హీరోగా రూపొందుతున్న ఖాన్ చిత్రం ఆర్థిక సమస్యల కారణంగా నిలిచిపోయింది. అదే విధంగా గౌతమ్‌మీనన్ దర్శక నిర్మాతగా శింబు కథానాయకుడు తెరకెక్కుతున్న అచ్చం ఎంబదు మడమయడా చిత్రం నిర్మాణం శింబు బీప్ సాంగ్ ఇతర సమస్యల కారణంగా నత్త నడకన నడుస్తోంది. ఇక ఎస్‌ఏ.సూర్య దర్శకత్వంలో విజయ్ హీరోగా చిత్రం తెరకెక్కనుందన్న ప్రచారం జరిగినా, అది తెర రూపం దాల్చలేదు.
ఇక సెల్వరాఘవన్ తన సోదరుడు ధనుష్ హీరోగా ఒక హారర్ చిత్రం చేయనున్నారనే ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితిలో ఆ ముగ్గురు దర్శకులు కలిసి చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారన్నది విశేషమే. ఈ దర్శక త్రయంలో సెల్వరాఘవన్ దర్శకుడుగా గౌతమ్‌మీనన్ నిర్మాణంలో ఎస్‌జే.సూర్య కథానాయకుడిగా ఈ చిత్రం తయారు కానుందని సమాచారం. ఇది ధనుష్‌తో చేయాలనుకున్న హార్రర్ కథతో తెరకెక్కనున్న చిత్రం అని కోలీవుడ్ వర్గాల సమాచారం.ఈ చిత్రంలో నటించనున్న నాయకి, ఇతర నట వర్గం, సాంకేతిక బృందం వివరాలను త్వరలో దర్శకనిర్మాతలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Post a Comment