కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఎవరైనా లూఠీ చేస్తే, ఎంత బాధ అనిపిస్తుందో... కళ్లెదుటే పైరసీ సీడీ కొనుక్కుని, సినిమా చూస్తున్నప్పుడు అందులో నటించినవాళ్లకూ, ఆ సినిమా తీసినవాళ్లకూ అంతే బాధగా ఉంటుంది. ఇటీవల కృతీ సనన్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఏదో పని మీద ఆమె ఢిల్లీ వెళ్లారు. విమానంలో ఓ వ్యక్తి ‘దిల్‌వాలే’ సినిమాను మొబైల్ ఫోన్‌లో చూడడం కృతీ సనన్ దృష్టిలో పడింది. షారుక్ ఖాన్, కాజోల్, వరుణ్ ధావన్, కృతీ సనన్ తదితరుల కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం వారం రోజుల క్రితం విడుదలైంది.
ఆ సినిమా పైరసీ కాపీనే ఆ ప్రయాణీకుడు చూస్తున్నాడు. కృతి ఆగ్రహం, ఆవేదనతో అతగాడి దగ్గరికెళ్లి, ‘ప్లీజ్... ఇలా ఫోన్‌లోకన్నా థియేటర్‌లో చూస్తే, మీరింకా ఎంజాయ్ చేస్తారు’ అని చాలా రిక్వెస్టింగ్‌గా చెప్పారు. కానీ, అతను కనికరించలేదు. ఈ బ్యూటీ మాటలను ఖాతరు చేయకుండా హాయిగా సినిమా చూశాడు. ఈ తతంగాన్ని ఫొటో తీసి, తన ట్విట్టర్‌లో కృతి పోస్ట్ చేశారు. ‘‘నా కళ్లెదుటే పైరసీ కాపీ చూశాడు. నేను తట్టుకోలేకపోయా. ఎంతోమంది కష్టంతో ఓ సినిమా రూపొందుతోంది. పైరసీ కాపీ చూసి, మా కష్టాన్ని వృథా చేయకండి. దయచేసి థియేటర్లకు వెళ్లి, సినిమా చూడండి’’ అని కూడా కృతి పేర్కొన్నారు.

Post a Comment