-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

February 16, 2016

తరతరాల చరిత్ర... ఓ చిన్న డిస్క్‌లో...


లండన్‌: శాస్త్రవేత్తలు అద్భుతం సాధించారు. 360 టెరాబైట్ల సామర్థ్యం. ఒకటి, రెండు కాదు.. ఏకంగా వందల కోట్ల ఏళ్ల పాటు పాడవ్వకుండా నిలిచే 5 డైమెన్షనల్‌ డేటా డిస్క్‌ను రూపొందించారు సౌతాంప్టన్‌ యూనివర్సిటీ ఆప్టో ఎలక్ట్రానిక్స్‌ పరిశోధన కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు. ఇక మీ సమాచారాన్ని మీ తర్వాతి ఏడు తరాలకే కాదు ఎన్ని తరాల వారికైనా భద్రంగా ఇవ్వొచ్చన్నమాట.!
కొన్ని తరాల పాటు నిలిచే 5 డైమెన్షనల్‌ డేటా డిస్క్‌ను ‘సూపర్‌ మ్యాన్‌ మెమరీ క్రిస్టల్‌’గా సంబోధిస్తున్నారు. దీనిలోని సాంకేతికతతో నేషనల్‌ ఆర్కైవ్స్‌, మ్యూజియం, లైబ్రరీ తదితర సంస్థల విలువైన సమాచారాన్ని భద్రంగా దాచుకోవచ్చు.
నానో స్ట్రక్చర్‌ గ్లాస్‌తో శాస్త్రవేత్తలు ఈ 5డి డిస్క్‌ను రూపొందించారు. ఫెమ్టోసెకండ్‌ లేజర్‌ రైటింగ్‌ ద్వారా డిస్క్‌లో డేటాను భద్రపరచవచ్చు. మనకు కావాల్సినప్పుడు తొలగించి.. మళ్లీ ఎక్కించుకోవచ్చు. 1000 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రతలోనూ డిస్క్‌ పాడవ్వదు. ఈ సాంకేతికతను 2013లో పరీక్షించినప్పుడు 300 కిలోబైట్ల డిజిటల్‌ టెక్ట్స్‌ ఫైల్‌ను విజయవంతంగా 5డి డిస్క్‌లో భద్రపరిచారు. ఇప్పుడు.. మానవ జాతి మనుగడకు అవసరమయ్యే మానవ హక్కుల ప్రకటన పత్రం, న్యూటన్‌ ఆప్టిక్స్‌, మాగ్నాకార్టా, కింగ్స్‌ జేమ్స్‌ బైబిల్‌ డిజిటల్‌ ఫైళ్లు భద్రపరిచారు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu