-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

December 31, 2015

ఆటోడ్రైవర్‌పైనే అనుమానాలు

{పియాంకతో కలిసి మూడు సార్లు
సినిమాకు వెళ్లిన రాము !
మొదట్లో విచారించి వదిలేసిన  పోలీసులు


పర్వతగిరి : కంబాలకుంట తండా బాలికలు బానోత్ భూమిక, బానోత్ ప్రియాంక మృతిపై మిస్టరీ ఇంకా వీడడం లేదు. అరుుతే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు, పలువురి అభిప్రాయం ప్రకారం.. విద్యార్థినుల అనుమానాస్పద మృతి ఘటనకు మండల కేంద్రానికి చెందిన ఓ ఆటోడ్రైవర్‌కు సంబంధముందనే అనుమానాలు బలపడుతున్నారుు.

ఇదే మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జేరిపోతుల రాము నవంబర్ 10న రోజువారీ ఫైనాన్స్‌లో రూ.15 వేలు రుణం తీసుకున్నాడు. అంతకు ముందు రోజైన దీపావళినాడు సెలవు ఉండడంతో కోసం ప్రియాంక ఇంటికి వచ్చింది.  రాము, ప్రియూంక కలిసి నవంబర్ 22 వరకు రెండు, మూడు సార్లు నెక్కొండ సినిమా థియేటర్‌కు వచ్చినట్లు ఓ విద్యార్థిని చెప్పడం అనుమానాలకు బలాన్నిస్తోంది. 23న వారిద్దరు మరోసారి  నెక్కొండలో కలుసుకున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా నవంబర్ 11వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రోజుకు రూ.150 చొప్పున గిరిగిరి డబ్బులు చెల్లించిన రాము 23వ తేదీ నుంచి కనిపించకుండా పోయూడు. దీన్ని బట్టి రాము ప్రియూంకతో ఉన్నట్లు ఆటో డ్రైవర్లు అనుమానిస్తున్నారు.

 23న సినిమాకు వెళ్లిన వారిలో రాము కూడా ఉన్నట్లు సమాచారం. భూమిక కోసం రాముతో కలిసి మూడు వెంకన్న అనే వ్యక్తి వచ్చేవాడని అదే హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థిని చెప్పడం గమనార్హం. కాగా 10 నెలల క్రితమే రాముకు పెళ్లి కాగా రెండు నెలలకే భార్యతో గొడవపెట్టుకుని కట్నం కావాలని ఆమెను పుట్టింటికి పంపినట్లు స్థానికులు తెలిపారు. రోజూ అర్ధరాత్రి ఒంటి గంటకు ఇంటికి వచ్చేవాడని వెల్లడించారు. నవంబర్ 25న ప్రియాంక, భూమిక తప్పిపోయినట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి వరకు రాము, వెంకన్న కూడా ఊర్లో లేరు. నవంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు రామును పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించగా ప్రియాంకతో కలిసి మూడుసార్లు సిని మాకు వెళ్లిన విషయూన్ని వెల్లడించినట్లు తెలి సింది. అరుుతే ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో తెలియదని చెప్పడంతో వదిలేశారు. అప్పటి నుంచి అతడు స్వగ్రామాన్ని వదిలేసి వేరొక ఊర్లో భార్యతో కలిసి ఉంటున్నట్లు సమాచారం.

పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఉంటే..
పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఉంటే ఇంత  దారుణం జరిగి ఉండేది కాదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆటో డ్రైవర్ అనేక విషయూలను చెప్పినా నామమాత్రంగా కేసు నమోదు చేశారు. ప్రియాంక, భూమిక తల్లిదండ్రులు మాత్రం పోలీసులు ఏ మాత్రం సహకరించలేదని తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ములు గు, నల్లబెల్లి, పర్వతగిరి పోలీసులు ఎవరికి వారే దర్యాప్తులో నిర్లక్ష్యం ప్రదర్శించారు. 

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu