MENU

Pages

Menu

March 03, 2016

అమెజాన్‌ వచ్చేస్తోంది

freshdeals365.com

ప్రపంచ ఈ-కామర్స్‌ దిగ్గజం అయిన అమెజాన్‌ తన రెండో ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. అమెరికా వెలుపల ఆ సంస్థ నిర్మించనున్న అతి పెద్ద కార్యాలయంగా ఇది నిలవనుంది. ఫేస్‌బుక్‌, గూగుల్‌, ఉబెర్‌ లాంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే హైదరాబాద్‌లో వ్యూహాత్మక కార్యాలయాలను ఏర్పరచుకున్నాయి. అదేవిధంగా అమెజాన్‌ కూడా తెలంగాణకు రానుంది. ఈ నెలాఖరులోగా హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనుంది. ఇప్పటికే ఆ సంస్థ ప్రతినిధులతో రాష్ట్ర ఐటీశాఖ అధికారులు చర్చలు జరిపారు. తేదీ ఖరారుపై అధికారిక నిర్ణయం వెల్లడికావాల్సి ఉంది. హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని నెలకొల్పాలని అమెజాన్‌ సంస్థ గతంలోనే నిర్ణయించింది. దీనికి అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం నానక్‌రామ్‌గూడలో కేటాయించింది. అయితే, ఆ స్థలం న్యాయవివాదాల్లో ఉండటం వల్ల ప్రతిపాదన కార్యరూపం దాల్చటంలో ఆలస్యమైంది. న్యాయవివాదాలు తొలగిపోవటంతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఆధ్వర్యంలోని అధికారుల బృందం అమెరికా వెళ్లినపుడు అమెజాన్‌ ప్రతినిధులతో చర్చలు జరిపారు. వాషింగ్టన్‌ తరువాత తమ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు సంస్థ అంగీకరించింది. ఆసియాలో అమెజాన్‌ ప్రధానకార్యాలయంగా ఇది నిలవనుంది.
భాగ్యనగరంలో 14వేల మందికిపైగా..
అమెజాన్‌ హైదరాబాద్‌ కార్యాలయంలో తొలివిడతలో దాదాపు 14వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేసే అవకాశముంది. నానక్‌రామ్‌గూడలో దాదాపు 30 లక్షల చ.అడుగుల విస్తీర్ణం కలిగిన భవనాన్ని నిర్మించనుంది. ఇది అతిపెద్ద భవనమని ఐటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ భవన శంకుస్థాపనకు అమెజాన్‌ సంస్థలోని ముఖ్యలు హాజరుకానున్నారు. మార్చి నెలాఖరులోగా శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దశల వారీగా ఈ సంస్థ హైదరాబాద్‌లో పెట్టుబడులుపెడుతూ మరింత మందికి ఉపాధి కల్పించే అవకాశమున్నట్లు తెలిసింది.
ఇదీ అమెజాన్‌ చరిత్ర...: అమెరికాలో 1994లో అమెజాన్‌ సంస్థ ప్రారంభమైంది. ఈ సంస్థ ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, పరికరాల తయారీతో పాటు వైర్‌లెస్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఈ కామర్స్‌ తదితర వ్యాపారాలు నిర్వహిస్తోంది. అమెరికాలో అతిపెద్ద ఈ-కామర్స్‌ సంస్థ అయిన అమెజాన్‌.. ప్రపంచ వ్యాప్తంగా తన వ్యాపారాన్ని విస్తరించింది. అమెజాన్‌ సంస్థ ఇప్పటికే హైదరాబాద్‌కు సమీపంలోని కొత్తూరు వద్ద గోదాముల కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచి తెలంగాణ పరిసర జిల్లాలకు ఆన్‌లైన్‌ ద్వారా ఆర్డర్లు ఇచ్చిన వారికి ఎలక్ట్రానిక్‌ తదితర ఉత్పత్తులు అందిస్తోంది. దాదాపు రూ.7,27,600 కోట్ల (107 బిలియన్‌ డాలర్ల)వార్షిక ఆదాయం కలిగిన ఈ సంస్థలో 2.3 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

No comments:

Post a Comment