MENU

Pages

Menu

March 03, 2016

నన్ను ఎవరైనా కొనుక్కోండి.. ఓ ఐఐటీ విద్యార్థి !

freshdeals365.com


ఉద్యోగం కోసం బయోడేటా, అర్హత పత్రాలతో అభ్యర్థులు కంపెనీల చుట్టూ తిరగడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఓ ఐఐటీ విద్యార్థి మాత్రం వినూత్నంగా ఆలోచించి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఈ -కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ విభాగంలో ఉద్యోగం కోసం ప్రయత్నించిన అతను.. ఆ వెబ్ సైట్ లోనే తాను అమ్మకానికి ఉన్నానంటూ తన ప్రొఫైల్ ఉంచాడు. అందులోనే తన రెజ్యూమ్ మొత్తాన్ని కూడా అప్‌లోడ్ చేశాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఐఐటీ ఖరగ్ పూర్ లో బీటెక్ చదువుకున్న ఆకాశ్ నీరజ్ మిట్టల్ ఇటీవల ఫ్లిప్ కార్ట్ లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాడు. అయితే అది అందరిలా చేస్తే విశేషం ఏముంది అనుకున్నాడో ఏమో.. వెబ్ సైట్ లో తాను అమ్మకానికి ఉన్నానంటూ పూర్తి వివరాలు అందించాడు. తనకు రేటు కూడా ఫిక్స్ చేసుకున్నాడు. రూ. 27,60,200 గా తన ధరను నిర్ణయించుకున్న మిట్టల్.. ఫ్రీ డెలివరీ, లైఫ్ టైం వారెంటీ అంటూ ఆఫర్ ను కూడా ప్రకటించాడు. దేశంలోని మేధావులతో పోటీ పడినప్పుడు.. మిగతావారితో పోల్చితే మనం ఏదైనా కొత్తగా చేయాలని మిట్టల్ భావించాడని అతని జూనియర్ బజాజ్ తెలిపాడు. మరి ఎంతో వినూత్నంగా అలోచించిన మిట్టల్ కు ఫ్లిప్ కార్ట్ స్వాగతం పలుకుతుందని అతని సన్నిహితులు భావిస్తున్నారు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

No comments:

Post a Comment