MENU

Pages

Menu

May 22, 2016

అభి‘షాక్‌’ ...!!!

 
అభిషేక్‌, ఐశ్వర్యరాయ్‌ జంటకు ఫాలోయింగ్‌ ఎక్కువే. ఈ గ్లామర్‌ కపుల్‌ ఎక్కడ కనిపించినా కెమెరా ఫ్లాష్‌లు వెలుగుతూనే ఉంటాయి. అయితే ఆలుమగల మధ్య చిరాకులు, పరాకులు కామనే. ఈ గిల్లికజ్జాలు నాలుగు గోడల మధ్యసాగితే ఫర్వాలేదు. కాని, నలుగురిలో బయటపడితే మాత్రం గోరంతలు కొండతలుగా చెప్పుకుంటారు.
 
ఐశ్వర్య సెకండ్‌ 
ఇన్నింగ్స్‌కు గ్రాండ్‌ షోగా నిలిచిన సరబ్‌జిత ప్రీమియర్‌ షో సందర్భంగా ఐష్‌, అభిల మధ్య సాగిన ఓ సీను ఇప్పుడు యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ ప్రీమియర్‌ షోకు బచ్చన్‌ ఫ్యామిలీతో పాటు ఇండసీ్ట్ర పెద్దలంతా విచ్చేశారు. షో ముగిశాక.. సెలబ్రిటీలంతా వేదికపైకి చేరుకున్నారు. అభి, ఐష్‌ చెట్టాపట్టాలేసుకుని వేదికనెక్కారు. ఇద్దరినీ ఫొటోలకు పోజివ్వాల్సిందిగా ఫొటోగ్రాఫర్లు కోరడం.. ఐష్‌ సరేననడం.. మామూలుగానే జరిగిపోయాయి. అంతలోనే ఏమైందో కాని, అభిషేక్‌ నెర్వ్‌సగా ఫీలయ్యాడు. ఐష్‌ చేయిని నెమ్మదిగా వదిలించుకుని వెనుక నుంచి వేదిక పక్కకు వచ్చేసే ప్రయత్నం చేశాడు. ఫొటో దిగడానికి రావాల్సిందిగా భార్య పిలుస్తున్నా.. వినీ విననట్టు వ్యవహరించాడు. దీంతో ఐశ్వర్యనే భర్త దగ్గరగా వెళ్లి చేయి పట్టుకుని ఏదో చెబుతూ మళ్లీ సీన్‌లోకి తీసుకొచ్చింది. అయినా అయిష్టంగానే ఫొటోలకు పోజిచ్చాడు అభి. నాలుగు ఫ్లాష్‌లు పడ్డాయో లేదో.. ‘యూ క్యారియాన్‌..’ అంటూ ఐష్‌కు షాకిచ్చాడు. ఆయనగారి ప్రవర్తనతో ఆశ్చర్యపోవడం ఐశ్వర్య వంతైంది. అభి అలకపై బాలీవుడ్‌
మీడియాలో రకరకాల కథనాలు వెల్లువెత్తుతున్నాయి. పదిమందిలో భార్యను చులకన చేశాడంటూ జూనియర్‌ బచ్చన్‌ను కార్నర్‌ చేస్తున్నాయి. ఈ ఇష్యూ సంగతి ఎలా ఉన్నా.. సదరు వీడియో మాత్రం యూట్యూబ్‌లో రికార్డు హిట్లు కొల్లగొడుతోంది. రెండు రోజుల్లోనే ఏకంగా పదిలక్షల పైచిలుకు హిట్లు సాధించింది.



click the below image to get a best deal::


https://www.facebook.com/freshdeals365




When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

No comments:

Post a Comment