టీ20 ప్రపంచకప్ లో భాగంగా గురువారం రాత్రి జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ పై వెస్టిండీస్ విజయం సాధించింది. వాంఖేడ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టీమీండియాపై విండీస్ టీమ్ పైచేయి సాధించి తుది సమరానికి అర్హత సాధించింది. భారత్-విండీస్ మ్యాచ్ తో పాటు, ఈ వరల్డ్ కప్ లోని కొన్ని విశేషాలు గురించి తెలుసుకుందాం.
ఈ టీ20 ప్రపంచకప్ లో టీమిండియా ఒక్కసారి మాత్రమే టాస్ గెలిచింది. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచుల్లో టాస్ ఓడినప్పటికీ విజయాలు నమోదు చేసింది.
టాప్-3 బ్యాట్స్ మన్లు 40 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించడం ఇది మూడోసారి. 2013లో న్యూజిలాండ్-ఇంగ్లండ్, 2016లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచుల్లో ఈ ఫీట్ నమోదైంది.
ఈ టీ20 ప్రపంచకప్ లో వాంఖెడే స్టేడియంలో 5 మ్యాచ్ లు జరగ్గా నాలుగుసార్లు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఈ నాలుగుసార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలులు సాధించిన ఆటగాడిగా కోహ్లి రికార్డు సృష్టించాడు. 16 అర్ధసెంచరీలతో టాప్ లో నిలిచాడు.
టీ20ల్లో ఫస్ట్ బ్యాటింగ్ లో విరాట్ కోహ్లి బ్యాటింగ్ సగటు 35.22. ఛేజింగుల్లో అతడి బ్యాటింగ్ యావరేజ్ 91.80
వాంఖెడే స్టేడియంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ సగటు 37.67. అంతకుముందు 39 ఇన్నింగ్స్ లో 135.97 స్ట్రైక్ రేటుతో 1168 పరుగులు చేశాడు.
పవర్ ప్లేలో 55 పరుగులు చేసింది. టీ20 పవర్ ప్లేలో టీమిండియాకు ఇదే అత్యుత్తమ స్కోరు. వికెట్ నష్టపోకుండా పవర్ ప్లే ఆడడం కూడా ఇదే మొదటిసారి.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా వెస్టిండీస్ (193) గుర్తింపు పొందింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా (192; 2010లో పాక్‌పై) పేరిట ఉండేది.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

No comments:
Post a Comment