MENU

Pages

Menu

April 02, 2016

గణితం సులభతరం ..?


ఇష్టంగా చేస్తే మాథ్స్‌ సులభమనిపిస్తుంది. ఇష్టం లేకపోతే మాత్రం ఫార్ములాలు, ఈక్వేషన్స్‌తో తలనొప్పి వస్తుంది. అయితే పిల్లలు సులభంగా లెక్కలు నేర్చుకోవడానికి యాప్‌ను ఉపయోగిస్తే సరి. ఆరేళ్లు లేక అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న పిల్లలకు మాథ్స్‌ నేర్చుకోవడానికి ‘మాథ్‌ ఇవాల్వ్‌’ లెర్నింగ్‌ యాప్‌ బాగా ఉపయోగపడుతుంది. గుణకారాలు, తీసివేతలు, కూడికలు వంటివి ప్రాక్టీస్‌ చేయడానికి ఈ అప్లికేషన్‌ బాగా ఉపకరిస్తుంది. పిల్లలు గణితంలో వెనకబడి ఉంటే కనుక ఇంప్రూవ్‌ కావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రాక్టీస్‌ మోడ్‌ను ఎంచుకుంటే మాథ్స్‌ ఫాక్ట్స్‌ను ప్రాక్టీస్‌ చేయవచ్చు. ప్లేయర్‌ హిస్టరీలో ప్రతీ ప్లేయర్‌ పర్‌ఫార్మెన్స్‌ సేవ్‌ అవుతుంది. దీనివల్ల పిల్లలు ఎక్కడ వెనకబడి ఉన్నారు, ఏది నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో తల్లిదండ్రులు, టీచర్లు సులభంగా తెలుసుకోవచ్చు. అయితే ఈ అప్లికేషన్‌ మాత్రం ఉచితం కాదు. ఆండ్రాయిడ్‌ వినియోగదారులు, ఐఓఎస్‌ వినియోగదారులు డబ్బులు చెల్లించి డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

No comments:

Post a Comment