MENU

Pages

Menu

February 13, 2016

రజనీ సినిమాకి పొలిటికల్ గండం...?



సూపర్ స్టార్ రజనీకాంత్.. చిత్రనగరిలో ఈ పేరుకున్న ప్రత్యేకత నేడు పనిగట్టుకు చెప్పాల్సిన పనిలేదు. అలాంటి తలైవా సినిమా ఇప్పుడు రాజకీయ సమస్యల్లో చిక్కుకుంది. వివరాల్లోకెళితే... ‘కొచ్చడయాన్’ (తెలుగులో విక్రమసింహ), ‘లింగ’ సినిమాలు పరాజయం పాలవడంతో తర్వాతి సినిమాకి ఆ ఫలితం రాకూడదనే ఉద్దేశంతో రజనీ అగ్ర దర్శకులను కాదని యువ దర్శకుడు రంజిత్‌తో 'కబాలి' మొదలెట్టారు. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పుడు పూర్తికావొచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను మార్చ్‌లో పూర్తి చేసి ఏప్రిల్ 14న విడుదల చేయాలని నిర్మాత కలైపులి ఎస్ థాను సన్నాహాలు చేస్తుండగా తమిళనాడు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ప్రస్తుతానికి ఆ పనులను మానుకోమని చెప్పారట రజనీ. ఎన్నికల తేదీపై క్లారిటీ వచ్చేవరకు వేచి చూసి అప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని సూచించినట్టు సమాచారం. దీంతో ఏప్రిల్ చివరి వారంలో లేదా మేలో ‘కబాలి’ విడుదలవుతుందని చెన్నై సినీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా ఈ సినిమా తొలి టీజర్ ఈ నెల 24న విడుదల కానుంది


When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

No comments:

Post a Comment