MENU

Pages

Menu

February 17, 2016

ఆన్‌లైన్‌లో మోసాలు.. ముఠా గుట్టురట్టు!!!!


హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు సైబర్‌ క్రైం పోలీసులు. నగరంలో సైబర్‌ క్రైం ఆపరేషన్‌ లో భాగంగా బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12 లో ఉన్న ప్లానెట్‌ ఐ ట్రేడ్‌ సెంటర్‌పై బుధవారం సైబర్‌ క్రైం పోలీసులు దాడులు జరిపారు. సైబర్‌క్రైం ఏసీపీ రఘువీర్‌, సీఐ శంకర్రావు నేతృత్వంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ప్లానెట్‌ ఐ ట్రేడ్‌ సెంటర్‌ కంపెనీ మేనేజర్‌ పాటూరి వీరభద్రరావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. 50 మంది ఉద్యోగులతో వీరభద్రరావు కాల్‌ సెంటర్‌ను నడుపుతున్నాడనీ, లక్కీ డిప్‌ల ద్వారా 3 తులాల బంగారం ఇస్తామంటూ మోసానికి పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు.

ఓన్లీ పోస్టల్‌ ఛార్జీలు మాత్రమే కట్టాలంటూ మోసానికి పాల్పడుతున్నాడని చెప్పారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న గిప్ట్‌లో పుసల దండను ఇచ్చి ఈ కంపెనీకి చెందిన ముఠా మోసానికి పాల్పడినట్టు తెలిపారు. రోజుకు వేయ్యి నుంచి రెండువేల మందిని ఈ ముఠా మోసగిస్తోంది. తమిళనాడు, ఒరిస్సా, కేరళ రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇలాంటి పార్సిళ్లు పంపేందుకు కంపెనీ యజమాని పోస్టల్‌ కోడ్‌ తీసుకున్నట్టు సైబర్‌ క్రైం పోలీసులు వెల్లడించారు.



When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

No comments:

Post a Comment