MENU

Pages

Menu

February 17, 2016

మత్తులో ముంచాడు.. నగలు కాజేశాడు


2.03 కిలోల ఆభరణాల చోరీ కేసును ఛేదించిన పోలీసులు అదుపులో పాత నేరస్థుడు
అడ్డగుట్ట/మోండా: వరంగల్‌ జిల్లాకు చెందిన బంగారు దుకాణం గుమస్తా ప్రశాంత పోగొట్టుకున్న 2.03 కిలోల బంగారు ఆభరణాల కేసు మిస్టరీ వీడినట్టు సమాచారం. ప్రతినెలా నగరంలోని దుకాణాల నుంచి ఆభరణాలను తీసుకెళుతున్న ప్రశాంతపై నిజామాబాద్‌కు చెందిన పాత నేరస్థుడు కన్నేశాడు. ప్రశాంతతో పరిచయం పెంచుకుని అతడిని అనుసరించాడు. ఈనెల 11న నగరంలోని దుకాణాల నుంచి 2.03 కిలోల ఆభరణాలు తీసుకున్న ప్రశాంతను అతడు కలిశాడు. సికింద్రాబాద్‌లో ఓ బార్‌కు ప్రశాంతను తీసుకువెళ్లి మద్యం తాగించాడు. తర్వాత ఇరువురూ కలిసి హరిహరికళాభవన్‌ నుంచి నడుచుకుంటూ గురుద్వార్‌, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ మీదుగా రేతిఫైల్‌ బస్టాండ్‌ వైపు వెళ్లారు. సీసీ టీవీ పుటేజీలో ఇది నమోదైంది. రాత్రి ఉప్పల్‌ బస్టాండ్‌ వద్ద ఫుట్‌పాతపై ప్రశాంత స్పృహకోల్పోయాడు. ప్రశాంత వద్ద నున్న బంగారు ఆభరణాల సంచిని తీసుకుని అతడు పరారయ్యాడు. తెల్లారిస్పృహలోకి వచ్చిన ప్రశాంత నగల సంచి లేకపోవడంతో మార్కెట్‌ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. కేసు మిస్టరీని ఛేదించటానికి 56 మంది రంగంలోకి దిగారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. నిజామాబాద్‌ జిల్లా వెన్నెల గ్రామానికి చెందిన చిన్నారెడ్డిగా గుర్తించినట్టు సమాచారం. అతడు దొంగతనం చేసిన తర్వాత తాను ఉండే అద్దె ఇల్లు ఖాళీచేసి నిజామాబాద్‌లోని ఓలాడ్జికి మకాం మార్చాడు. సమాచారం అందడంతో మంగళవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో లాడ్జిపై దాడిచేసి 2.3 కిలోల ఆభరణాలను స్వాధీనం చేసుకుని అతడిని నగరానికి తీసుకొచ్చినట్టు సమాచారం. చిన్నారెడ్డిపై నిజామాబాద్‌లో 20 పైగా బంగారు ఆభరణాల చోరీ కేసులు ఉన్నట్టు తెలిసింది.


When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

No comments:

Post a Comment