MENU

Pages

Menu

February 16, 2016

సర్దార్ ఆడియోకు భారీ బడ్జెట్..!


ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న ‘స‌ర్దార్ గ‌బ్బర్‌సింగ్’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ సెట్‌లో హీరో ఎంట్రీ సాంగ్‌కి సంబంధించిన ఒక చ‌ర‌ణం కూడా చిత్రీక‌రించ‌నున్నట్లు తెలుస్తోంది. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి దేవిశ్రీ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఒక్క పాట మిన‌హా పాట‌ల‌న్నీ రికార్డింగ్ పూర్తయినట్లు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మార్చి 12న ఆడియో ఫంక్షన్‌ను మెగా అంచనాలతో అత్యంత భారీ స్థాయిలో దాదాపు రూ.1.50 కోట్ల ఖర్చుతో వేలాది మంది అభిమానుల మధ్య హైదరాదాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించడానికి మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్‌మెంట్స్ పతాకంపై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన కాజల్, రాయ్ లక్ష్మీ ఆడిపాడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాను ఉగాది కానుకగా ఏప్రిల్ 8న విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

No comments:

Post a Comment