- వ్యాప్తిని అడ్డుకుంటున్న నింబోలైడ్
- రోగకారక క్రిములపైనే ప్రభావం..
- టెక్సాస్ వర్సిటీ పరిశోధకుల ఆవిష్కరణ
హ్యూస్టన్, లండన్, ఫిబ్రవరి 12: ఆరోగ్య పరిరక్షణలో వేపచెట్టు ప్రాధాన్యం ఎంతగానో ఉందని మన పూర్వీకుల కాలంలోనే వెల్లడైంది. అయితే, ప్రాణాంతక కేన్సర్ల చికిత్సల్లోనూ వేప ప్రభావం చూపిస్తోందని తాజా అధ్యయనంలో తేలింది. వేప ఆకుల్లో ఉండే నింబోలైడ్ అనే పదార్థం పాంక్రియాటిక్ కేన్సర్ నిరోధంగా పనిచేస్తోందని టెక్సాస్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. కేన్సర్ వ్యాప్తిని, రూపాంతరాన్ని నింబోలైడ్ అడ్డుకుంటోందని చెప్పారు. రోగకారక కణాలపై తప్ప ఆరోగ్యవంతమైన కణాలపైన ఇది ఎలాంటి చెడు ప్రభావం చూపడం లేదని వర్సిటీకి చెందిన రాజ్‌కుమార్ లక్ష్మణస్వామి వివరించారు. పాంక్రియాటిక్ కేన్సర్.. కేన్సర్ మరణాల్లో ఎక్కువ శాతం ఈ మహమ్మారి మూలంగానేనని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రతీ ఐదేళ్లలో 94 శాతం మరణాలకు ఇదే కారణమవుతోందట. వ్యాధి నిర్ధారణ జరిగిన ఐదేళ్లలోపే బాధితులు మృత్యువాత పడుతున్నారని వైద్య నిపుణులు వెల్లడించారు.
వేగంగా విస్తరించడం, అవసరాన్నిబట్టి శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాపించడం ఈ కేన్సర్ లక్షణాలలో ప్రధానమైనవి. ప్రస్తుతం ఈ మహమ్మారిని సమర్థవంతంగా నిరోధించే చికిత్సలేవీ అందుబాటులో లేవు. ఈ క్రమంలో తాజా ఆవిష్కరణ పాంక్రియాటిక్ కేన్సర్‌కు మెరుగైన చికిత్సను రూపొందించేందుకు తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మిగతా కేన్సర్ల తరహాలోనే పాంక్రియాటిక్ కేన్సర్ బాధితులకూ కీమోథెరపీ, రేడియేషన్‌లతో చికిత్స చేస్తు న్నారు. అయితే, ప్రయోజనం మాటెలా ఉన్నా.. వీటితో ఎదురయ్యే దుష్ప్రభావాలే ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. కాగా, వేప ఆకులను తిన్నా ఎలాంటి దుష్ప్రభావం కలగదని, భారతీయులు ఎంతోమంది ఈ ఆకులను తినడమే దీనికి నిదర్శనమని వర్సిటీకి చెందిన రమాదేవి సుబ్రమణి తెలిపారు.
ప్రోస్టేట్ కేన్సర్ నిర్ధారణకు కొత్త పరీక్ష
ప్రోస్టేట్ కేన్సర్‌ను ప్రారంభదశలోనే గుర్తించే వైద్య పరీక్ష త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ప్రోస్టేట్ కేన్సర్ నిర్ధారణకు చిన్నపాటి శస్త్రచికిత్స తప్పనిసరి. దీన్ని తప్పించి, మూత్ర పరీక్ష ద్వారా కేన్సర్‌ను పసిగట్టేలా రూపొందించిన తాజా పరీక్షను 155 మంది వలంటీర్లపై పరీక్షించి చూశామని శాస్త్రవేత్తలు తెలిపారు. లివర్‌పూల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ ఇంగ్లాండ్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ పరిశోధన నిర్వహించారు. వలంటీర్ల మూత్ర పరీక్షలో ప్రోస్టేట్ కేన్సర్ ఆనవాళ్లను గుర్తించే ప్రయత్నం చేశారు. ఫలితాలను విశ్లేషించగా.. 58 మంది ప్రోస్టేట్, 24 మంది బ్లాడర్ కేన్సర్‌లతో బాధపడుతున్నట్లు తేలింది.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

No comments:
Post a Comment